ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. నాగార్జున బిగ్ బాస్ 5 నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎందుకో తెలియదు కానీ బిగ్ బాస్ తెలుగు వరకు మాత్రం హోస్టుల విషయంలో ఏదో శాపం ఉన్నట్లుంది. అందుకే ఓ పట్టాన ఎవరూ సరిగ్గా కొనసాగడం లేదు. తొలి సీజన్ ఎన్టీఆర్.. రెండో సీజన్ నాని.. మూడు నాలుగు సీజన్స్ నాగార్జున చేసారు.