Nagarjuna Remake Movies | రీమేక్ అనే పదం ఇపుడు క్రేజీగా మారింది. ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషల్లో రీమేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. అక్కినేని నాగార్జున కెరీర్లో ‘శివ’ వంటి డైరెక్ట్ బ్లాక్ బస్టర్స్‌తో పాటు పలు రీమేక్ సినిమాలు నాగార్జున కెరీర్లో సూపర్ హిట్‌గా నిలిచాయి. రీసెంట్గా నాగార్జున హీరోగా నటించిన ‘వైల్డ్ డాగ్’ మూవీ కూడా బాలీవుడ్ సినిమాకు రీమేక్. ఈ మూవీ కంటే ముందు నాగార్జున పలు రీమేక్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. మొత్తంగా నాగార్జున తన కెరీర్లో రీమేక్ చేసిన విషయానికొస్తే.. Photo : Twitter
‘వైల్డ్ డాగ్’ | ‘వైల్డ్ డాగ్’ మూవీ హిందీలో అర్జున్ కపూర్ హీరోగా నటించిన ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్’ మూవీని తెలుగులో కొంచెం స్టైలిష్‌గా తెరకెక్కించారు కొత్త దర్శకుడు అహిషోర్ సాల్మన్. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. కానీ ఓటీటీలో మాత్రం మంచి టాక్ సొంతం చేసుకుంది. (Instagram/Photo)
జగద్గురు ఆది శంకర | ప్రముఖ రచయత దర్శకుడు జే.కే.భారవి తెరకెక్కించిన ‘జగద్గురు ఆదిశంకర’ సినిమాలో నాగార్జున చండాలుడి వేషంలో కాసేపు అలరించారు. చారిత్రక నేపథ్యమున్న జగద్గురువు ఆది శంకరాచార్యుల జీవిత చరిత్రపై గతంలో తెలుగుతో పాటు హిందీ, కన్నడతో పాటు వివిధ భాషల్లో పలు చిత్రాలు తెరకెక్కాయి. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది. (Instagram/Photo)
శిరిడి సాయి | కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘శిరిడి సాయి’ మూవీ కూడా గతంలో విజయచందర్ ముఖ్యపాత్రలో నటించిన ‘శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం’ సినిమాకు రీమేక్. భగవాన్ శిరిడి సాయి జీవిత చరిత్రపై పలు భాషల్లో ఎన్నో చిత్రాలు తెరకెక్కాయి. తెలుగులో పలు చిత్రాలు వచ్చాయి కూడా. కానీ ‘శిరిడి సాయి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (Instagram/Photo)
మిస్టర్ బేచారా | Mr. బేచారా మూవీ అనిల్ కపూర్, శ్రీదేవి హీరో, హీరోయిన్లుగా నాగార్జున అతిథి పాత్రలో నటించిన ‘మిస్టర్ బేచారా’ మూవీ. తమిళంలో హిట్టైన ‘వీతిలే విశేషంగా’ మూవీకి రీమేక్. తెలుగులో ఈ చిత్రాన్ని ‘గౌరమ్మ నీ మొగుడెవరమ్మా’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేసారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్నే అందుకుంది. (File/Photo)
హలో బ్రదర్ | నాగార్జున అక్కినేని తొలిసారి ద్విపాత్రాభినయంలో ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హలో బ్రదర్’ మూవీ.. జాకీచాన్ హీరోగా నటించిన ‘ట్విన్ డ్రాగన్స్’ మూవీకి రీమేక్. ఈ చిత్రాన్ని మన నేటివిటీకి తగ్గట్టు పలు మార్పులు చేర్పులు చేసి తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. (File/Photo)
వారసుడు | నాగార్జున హీరోగా కృష్ణ మరో హీరోగా ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వారసుడు’ మూవీ హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటించిన ‘ఫూల్ ఔర్ కాంటే’ మూవీకి రీమేక్. ఈ సినిమా మలయాలంలో మమ్ముట్టి హీరోగా నటించిన ‘పరంపర’ మూవీని పలు మార్పులు చేర్పులతో తెరకెక్కించారు. ‘వారసుడు’ మూవీ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. (File/Photo)
శివ (హిందీ వెర్షన్) | నాగార్జున హీరోగా రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శివ’ సినిమా తెలుగులో కొత్త హిస్టరీనీ క్రియేట్ చేయడంతో పాటు టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ మూవీగా నిలిచిపోయింది. తెలుగు సినిమాను ‘శివ’ మూవీకి ముందు తర్వాతగా ఈ సినిమా లాండ్ మార్క్ మూవీగా నిలిచిపోయింది. ఈ చిత్రాన్ని హిందీలో వర్మ అదే ‘శివ’ టైటిల్‌తో రీమేక్ చేసారు. ఈ చిత్రం అక్కడ కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. (File/Photo)
నేటి సిద్ధార్ధ | క్రాంతి కుమార్ దర్శకత్వంలో నాగార్జున, కృష్ణంరాజు ముఖ్యపాత్రల్లో నటించిన ‘నేటి సిద్ధార్ధ’ మూవీ హిందీలో ఫిరోజ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘ధర్మాత్మ’ మూవీకి రీమేక్. ఈ సినిమా హాలీవుడ్లో తెరకెక్కిన ‘గాడ్ ఫాదర్’ మూవీకి ప్రీ మేక్ అని చెప్పాలి. ఇటువంటి కథలతో వివిధ భాషల్లో ఎన్నో సినిమాలు తెరకెక్కాయి. ‘నేటి సిద్ధార్ధ’ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. (File/Photo)
జానకి రాముడు | కే. రాఘవేంద్రరావు దర్శకత్వంలో నాగార్జున, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించిన ‘జానకి రాముడు’ సినిమా.. అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘మూగ మనసులు’ సినిమాను ఇన్స్ప్రేషన్గా తీసుకొని తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. (File/Photo)
నాగార్జున తన కెరీర్లో 25 చిత్రాలు వేరే భాషల్లో హిట్టైన సినిమాలను తెలుగులో రీమేక్ చేసారు. అందులో సగం హిట్టైయితే.. సగం మాత్రం ఫ్లాప్‌గా నిలిచాయి. మొత్తంగా నాగార్జున రీమేక్ చేసిన చిత్రాల్లో బ్లాక్ బస్టర్స్ కూడా ఉన్నాయి. మొత్తంగా నాగార్జున కెరీర్లో రీమేక్ సినిమాల పాత్రను కొట్టిపారేయలేము. (File/Photo)