Nagarjuna - Ramesh Babu - Jagapathi Babu : నాగార్జన, రమేష్ బాబు, జగపతి బాబు మధ్య చిత్రమైన పోలిక ఉంది. ఈ ముగ్గురులో నాగార్జున.. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చి తండ్రి తగ్గ తనయుడిగా రాణించారు. అటు రమేష్ బాబు కూడా సూపర్ స్టార్ కృష్ణ వారసత్వంతో ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టారు. ఇక జగపతి బాబు విషయానికొస్తే.. ఈయన జగపతి ఆర్ట్స్ అధినేత ప్రముఖ నిర్మాత వి.బి.రాజేంద్రప్రసాద్ తనయుడిగా హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. (File/Photo)
హీరో నాగార్జున విషయానికొస్తే.. ఈయన చిన్నపుడు అక్కినేని నాగేశ్వరరావు హీరోగా నటించిన ‘వెలుగు నీడలు’, సుడిగుండాలు’ సినిమాల్లో బాల నటుడిగా నటించారు. ఆ తర్వాత 1986లో ‘విక్రమ్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా హిందీలో జాకీ ష్రాఫ్, మీనాక్షి శేశాద్రి హీరో, హీరోయిన్లుగా సుభాష్ ఘాయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హీరో’ మూవీకి రీమేక్‌గా తెరకెక్కింది. (File/Photo)
‘విక్రమ్’ సినిమాను అక్కినేని ఓన్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నాగార్జున అన్నయ్య .. అక్కినేని వెంకట్ నిర్మాతగా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని వి.మధుసూదన రావు డైరెక్ట్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక హీరో మూవీ ..కథానాయకుడిగా జాకీష్రాప్కు ఫస్ట్ మూవీ. (File/Photo)
సూపర్ స్టార్ కృష్ణ తన పెద్ద కుమారుడు రమేష్ బాబును హీరోగా పరిచయం చేసే ముందు పెద్ద కసరత్తు చేశారు. రమేష్ బాబు. 23 ఏళ్ల వయసులో రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ్ రావు కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి వంటి హీరోలు పరిచయమైన నేపథ్యంలో రమేష్ బాబు ఎంట్రీ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పటికే ఎన్టీఆర్, కృష్ణ మధ్య మాటలు లేవు. ఇక ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి అక్కినేని నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసారు. (File/Photo)
అంతకు ముందే రమేష్ బాబు.. హీరో కృష్ణ హీరోగా నటించిన పలు చిత్రాల్లో బాల నటుడిగా నటించిన అనుభవం ఉంది. కథానాయకుడిగా పరిచయం అయ్యే ముందు డాన్స్, ఫైట్స్, డైలాగ్స్ విషయంలో రమేష్ బాబుకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. కథ విషయంలో ఎక్కడ తగ్గేదేలే అంటూ.. హిందీలో సూపర్ హిట్టైన ‘బేతాబ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ‘బేతాబ్’ హీరోగా సన్నిడియోల్‌కు మొదటి చిత్రం కావడం విశేషం. ఇక తెలుగులో సోలో హీరోగా రమేష్ బాబుకు ఫస్ట్ మూవీ కావడం విశేషం. (File/Photo)
‘సామ్రాట్’ చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో పద్మాలయా స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కింది. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ మాటలు అందించారు. ఇక బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీలహరి సంగీతం అందించారు. అప్పటికే కెమెరామెన్‌గా ఎస్టాబ్లిష్ అయిన వి.యస్.ఆర్.స్వామి పనిచేశారు. శారద ముఖ్యపాత్రలో నటించారు. ఇక హీరోయిన్గా బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ నటించింది. (Twitter/Photo)
ఇలా రమేష్ బాబు ఎంట్రీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు సూపర్ కృష్ణ. ఈ చిత్రాన్ని మొదట ఎస్.వి. రాజేంద్ర సింగ్ బాబును డైరెక్టర్‌గా ఎన్నుకున్నారు. ఓ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. డబ్బు ఖర్చు అవుతున్న షూటింగ్ ముందుకు సాగకపోవడంతో.. చివరకు సీనియర్ దర్శకుడు వి.మధుసూదన రావు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసి డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం 1987 సమ్మర్ కానుకగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. (Twitter/Photo)
జగపతి బాబు కూడా తెలుగులో ఎన్నో మెబరబుల్ హిట్స్ అందించిన నిర్మాత జగపతి ఆర్ట్స్ అధినేత వి.బి.రాజేంద్ర ప్రసాద్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈయన మొదటి చిత్రం ‘సింహ స్వప్నం’. ఈ చిత్రంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు ముఖ్యపాత్రలో జగపతి బాబు తండ్రి పాత్రలో నటించారు. తొలి సినిమాలో జగపతి డ్యూయల్ రోల్లో నటించారు. ఈ సినిమా హిందీలో హిట్టైన ‘ఖత్రోం కే ఖిలాడి’ మూవీకి రీమేక్. హిందీలో ధర్మేంద్ర, సంజయ్ దత్, చుంకీ పాండే నటించారు. తెలుగులో ధర్మేంద్ర పాత్రను తెలుగులో కృష్ణంరాజు పోషించారు. ఇక సంజయ్ దత్, చుంకీ పాండే పాత్రలను తెలుగులో జగపతి బాబు డ్యూయల్ రోల్లో నటించడం విశేషం.
ఇలా తొలి సినిమాలోనే జగపతి బాబు ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఈ చిత్రంలో జగపతి బాబు సరసన వాణీ విశ్వనాథ్, శాంతి ప్రియ హీరోయిన్స్‌గా నటించారు. కృష్ణంరాజు ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో నటించారు. ఆయన సరసన జయసుధ నటించారు. ఈ చిత్రాన్ని జగపతి బాబు సొంత బ్యానర్ జగపతి ఆర్ట్స్ పతాకంపై ఆయన తండ్రి వీరమాచినేని బాబు రాజేంద్ర ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమాకు చక్రవర్తి సంగీతం అందించారు. సీనియర్ డైరెక్టర్ వి.మధుసూదన్ రావు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఈ చిత్రం 1989 ఫిబ్రవరి 3న విడుదలై బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. (Twitter/Photo)
మొత్తంగా నాగార్జున, రమేష్ బాబు, జగపతి బాబు తొలి సినిమాలు హిందీలో హిట్టైన సినిమాలను తెలుగులో రీమేక్ చేశారు. అంతేకాదు ఈ ముగ్గురు నట వారసులు దర్శకుడు వి.మధుసూదన రావు చేతులు మీదుగా సినీ ఇండస్ట్రీలో హీరోలుగా అడుగు పెట్టారు. వీరిలో నాగార్జున, జగపతి బాబు హీరోలుగా తమ కంటూ ఎస్టాబ్లిష్ అయ్యారు. కానీ రమేష్ బాబు మొదట్లో దూకుడుమీదున్న ఆ తర్వాత హీరోగా సక్సెస్ కాకపోవడం విశేషం. (File/Photo)