Nagarjuna - K Raghavendra Rao - Annamayya | టాలీవుడ్ సీనియర్ అగ్ర కథానాయకుల్లో ఒకడైన నాగార్జున అక్కినేని కేవలం కమర్షియల్ చిత్రాల్లోనే కాదు.. భక్తి చిత్రాల్లోనూ నటించి ఆకట్టుకున్నారు. ఇక ఈయనలోని నటుడిని వెలికి తీసుకొచ్చిన దర్శకుడు రాఘవేంద్రరావు. ఆయన దర్శకత్వంలో ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’, ‘ఓంనమోవేంకటేశాయ’, ‘శిరిడీసాయి’ వంటి చిత్రాల్లో నాగార్జున నటించారు. ఇందులో ‘శిరిడీసాయి’లో మాత్రమే నాగార్జున సాయిబాబాగా నటించారు.మిగిలిన చిత్రాల్లో భక్తుడిగా మెప్పించారు.
అప్పటి వరకు నాగార్జున అంటే లవ్ అండ్ యాక్షన్ కమర్షియల్ సినిమాల హీరో మాత్రమే. కానీ ‘అన్నమయ్య’తో రాఘవేంద్రరావు నాగార్జున ఇమేజ్ను పూర్తిగా మార్చేశారు. ఏడుకొండల స్వామి వెంకటేశ్వరస్వామి కీర్తనలు రాసిన పరమ భక్తుడు అన్నమయ్యగా నాగార్జున నటిస్తాడని ప్రకటించినప్పుడు చాలా మంది నాగార్జున.. భక్తి చిత్రంలో నటిస్తున్నాడా? అని అందరు ఆశ్యర్యపోయారు.
నాగార్జున కెరీర్లో మైల్స్టోన్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమా పలు కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంది. అంతేకాదు హైదరాబాద్ దేవి 70 ఎంఎం థియేటర్స్‌లో కూడా సిల్లర్ జూబ్లీ పూర్తి చేసుకుంది. ఈ సినిమా అన్నమయ్య జయంతి రోజున విడుదలైంది. అటు ఈ సినిమాలో అన్నమయ్య పాత్రధారి నాగార్జున పుట్టినరోజైన ఆగష్టు 29న ఈ సినిమా వంద రోజులు పూర్తి చేసుకోవడం మరో విశేషంగా చెప్పుకోవాలి. (Twitter/Photo)
‘అన్నమయ్య’ విషయంలో ఓ ఆసక్తికరమైన విషయమొకటి చోటు చేసుకుంది. అదేంటంటే.. ‘అన్నమయ్య’సినిమా అనుకున్నప్పుడు భక్తుడిగా టైటిల్ పాత్రలో నాగార్జున నటిస్తాడు సరే! మరి ఏడుకొండల స్వామి..వెంకటేశ్వరస్వామిగా ఎవరు నటిస్తారు? అనే సందేహం వచ్చింది. సినిమాలో కొన్ని సన్నివేశాల్లో భక్తుడైనా నాగార్జున.. వెంకటేశ్వరస్వామి పాత్రధారి పాదాలపై పడాల్సిన సన్నివేశాలున్నాయి. (Twitter/Photo)
అక్కినేని అభిమానుల మనోభావాలు దెబ్బతినకుండా మంచి స్ట్రేచర్ ఉన్న ఆర్టిస్టుని వెంకటేశ్వరునిగా నటింప చేస్తే బావుంటుందని భావించిన దర్శకేంద్రుడు ముందుగా సీనియర్ నటుడు శోభన్‌బాబుని కలిశారు. అయితే అప్పటికే శోభన్‌బాబు సినిమాల నుండి రిటైర్ అయిపోయారు. అయితే అన్నమయ్యగా చేస్తుంది నాగేశ్వరరావు కొడుకు.. మరోవైను దర్శకేంద్రుడు ఎలా చేయాలా? అని ఆలోచించిన శోభన్‌బాబు రూ. 50 లక్షల రెమ్యునరేషన్ ఇస్తే చేస్తానని చెప్పారట (Twitter/Photo)
చివరకు తెగ ఆలోచించిన తర్వాత సుమన్ గుర్తుకువచ్చాడు. సుమన్ సీనియర్ యాక్టర్.. కావడంతో ఎలాంటి సమస్య ఉండదని రాఘవేంద్రరావు భావించడంతో అప్పుడు సుమన్‌ని పిలిపించి ఫొటో షూట్ చేయించారు. ఆయనకు గెటప్ చక్కగా సూట్ కావడంతో చివరకు సుమన్ వెంకటేశ్వరుడి పాత్రధారిగా నటించి అందరినీ మెప్పించారు. ‘అన్నమయ్య’ సినిమాలో వెంకటేశ్వరుడి పాత్రధారి వెనుక నడిచిన అసలు కథ అదన్నమాట. (Twitter/Photo)
అన్నమయ్య చిత్రంలో నాగార్జున సరసన రమ్యకృష్ణ, కస్తూరి నటించారు. ఈ సినిమా అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఉత్తమ చిత్రం, నటుడు, దర్శకుడు, బెస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్, ఆర్ట్ డైరెక్టర్, కాస్ట్యూమ్ డిజైనర్,బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్, సినిమాటోగ్రఫర్ సహా ఎనిమిది విభాగాల్లో 8 నంది అవార్డులు అందుకుంది. (Twitter/Photo)