Nagarjuna - Keeravani: అక్కినేని నాగార్జున తన సినీ కెరీర్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. అందులో మ్యూజికల్‌గా హిట్టైన సినిమాలు ఎన్నో ఉన్నాయి. అందులో కీరవాణి మ్యూజిక్‌లో నాగార్జున చేసిన చిత్రాలు అత్యంత ప్రేక్షకాదరణ పొందాయి. మొత్తంగా వీళ్ల కాంబినేషన్లో వచ్చిన చిత్రాలేమిటో మీరు ఓ లుక్కేయండి.
7. అన్నమయ్య | నాగార్జున, కీరవాణి కాంబినేషన్లో వచ్చిన ఏడో చిత్రం అన్నమయ్య. నాగార్జున, కే.రాఘవేంద్ర రావు కాంబినేషన్లో వచ్చిన ఆరో చిత్రం. ఈ సినిమా నాగార్జున కెరీర్లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. అంతేకాదు అన్నమయ్య చిత్రం టాలీవుడ్ సినీ చరిత్రలో ఒక సంచలన చిత్రంగా నిలిచిపోయింది. ఈ సినిమాలోని నటనకు నాగార్జున జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా స్పెషల్ జ్యూరీ అవార్డు అందుకున్నారు. అటు కీరవాణి ఈ సినిమాకు గాను జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నారు. (Facebook/Photo)
12. శ్రీరామదాసు | నాగార్జున, కీరవాణి కాంబినేషన్లో వచ్చిన 12వ చిత్రం ’శ్రీరామదాసు’. కే.రాఘవేంద్ర రావు, నాగార్జున కాంబినేషన్లో వచ్చిన ఏడో చిత్రం ‘శ్రీరామదాసు’. ఈ చిత్రం బాక్సాపీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది. ఐతే.. భక్త రామదాసు 1620- 1680 మధ్య కాలంలో 17 వ శతాబ్దానికి చెందిన వారు. మరోవైపు భక్త రామదాసుకు జ్ఞాన బోధ చేసిన కబీర్ దాస్ జీవించిన కాలం 1399-1518 ఈయన 15, 16వ శతాబ్ధానికి చెందిన వారు. ఇలా ఎపుడు కలవని వీళ్లిద్దరిని ఈ సినిమాలో చూపెట్టి.. తప్పుడు చరిత్రను రుద్దారంటూ కొంత మంది సోషల్ మీడియాలో ఈ సినిమాను తెరకెక్కించిన వాళ్లపై రుసరుస లాడారు. గతంలో నాగయ్య హీరోగా తెరకెక్కించిన చిత్రంలో కూడా ఇలానే చూపించారు. మొత్తంగా చరిత్రను వక్రీకరించి తెరకెక్కించిన శ్రీరామదాసు చిత్రం మంచి విజయాన్నే సాధించింది. (Twitter/Photo)
15. ఓం నమో వేంకటేశాయ | కే.రాఘవేంద్ర రావు, కీరవాణి కాంబినేషన్లో వచ్చిన 15వ చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను దర్శకుడు ‘హాతిరామ్ బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. తిరుమలలో ప్రస్తుతం ఉన్న ఆచార సంప్రదాయాలు ప్రవేశపెట్టిన అపర భక్తుడు. అంతేకాదు తిరుమల శ్రీవారే స్యయంగా ఈయనతో పాచికలు ఆట ఆడారు. గతంలో తెరకెక్కిన ‘శ్రీ వెంకటేవ్వర మహత్యం’ ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర స్వామి కళ్యాణం’ సినిమాల్లో కథ భాగంగా హాతిరామ్ బాబాజీ కథను ప్రస్తావించడం జరిగింది. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. (Twitter/Photo)
నాగార్జున కీరవాణి కాంబినేషన్లో మొత్తంగా 15 చిత్రాలు తెరకెక్కితే.. అందులో సగానికి పైగా చిత్రాలు బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. కొన్ని చిత్రాలు యావరేజ్‌గా నిలిస్తే.. ఇంకొన్ని చిత్రాలు అంతగా ప్రేక్షకాదరణ పొందలేదు. మొత్తంగా టాలీవుడ్లో నాగార్జున, కీరవాణిది సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పాలి. (File/Photo)