చదువు ఉండదు.. ఏముండదు.. బ్యాగ్రౌండ్ ఉంది కాబట్టి సినిమాల్లోకి వచ్చేస్తారు.. వాళ్లను జనంపై రుద్దేస్తారు అంటూ ఇండస్ట్రీలో చాలా మంది నటులు, టెక్నీషియన్స్పై ఓ చెడు అభిప్రాయం ప్రేక్షకుల్లో పడిపోయింది. అయితే అలాంటిదేం లేదు.. ఇండస్ట్రీలో కూడా చాలా మంది హీరోలు బాగా చదువుకున్న వాళ్లున్నారని కొందరు నిరూపిస్తున్నారు. తమకు సినిమాల కంటే ముందు చదువు ముఖ్యం అని.. వాటిని పూర్తి చేసి.. డిగ్రీ చేత పట్టుకున్న తర్వాతే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.
చదువుకున్నా లేకపోయినా కూడా వాళ్లకు పెద్దగా తేడా ఏం ఉండదు అని చాలా మంది అనుకుంటారు. కానీ చాలా మంది సినిమా హీరోలు, దర్శకులు ఉన్నత చదువులు అభ్యసించిన తర్వాతే ఇండస్ట్రీకి వచ్చారు. అందులో కొందరు మెకానికల్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు. డిమాండ్ ఉన్న ఇంజనీరింగ్ పట్టా చేత పట్టుకుని ఇండస్ట్రీకి వచ్చారు కొందరు. అందులో తెలుగు ఇండస్ట్రీ నుంచి నాగార్జున, శేఖర్ కమ్ముల లాంటి వాళ్లు ఉంటే.. తమిళంలో గౌతమ్ మీనన్, కార్తి లాంటి ప్రముఖులు ఉన్నారు. మరి అలాంటి మెకానికల్ ఇంజనీర్స్ ఎవరో చూద్దాం..