అగ్నిపుత్రుడు | నాగార్జున అక్కినేని, కే.రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన తొలి సినిమా ‘అగ్నిపుత్రుడు’. ఈచిత్రంలో నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించారు. ఇక తండ్రితో నాగార్జునకు ఇది రెండో సినిమా. ఈ చిత్రంలో శివాజీ గణేషన్ అతిథి పాత్రలో నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోలేదు. (Twitter/Photo)
జానకి రాముడు | నాగార్జున, కే.రాఘవేంద్ర రావు కాంబినేషన్లో వచ్చిన మూడో సినిమా ‘జానకి రాముడు’. ఈ చిత్రంలో నాగార్జున సరసన విజయశాంతి కథానాయికగా నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. నాగేశ్వరరావు ‘మూగమనసులు’ సినిమాను బేస్ చేసుకొని విజయేంద్రప్రసాద్ కథ అందించారు. రచయతగా విజయేంద్ర ప్రసాద్‌కు ఇది ఫస్ట్ మూవీ. (Twitter/Photo)
శ్రీరామదాసు | నాగార్జున, కే.రాఘవేంద్ర రావు కాంబినేషన్లో వచ్చిన ఏడో చిత్రం ‘శ్రీరామదాసు’. ఈ చిత్రం బాక్సాపీస్ దగ్గర మంచి ఫలితాన్ని అందుకుంది. ఐతే.. భక్త రామదాసు 1620- 1680 మధ్య కాలంలో 17 వ శతాబ్దానికి చెందిన వారు. మరోవైపు భక్త రామదాసుకు జ్ఞాన బోధ చేసిన కబీర్ దాస్ జీవించిన కాలం 1399-1518 ఈయన 15, 16వ శతాబ్ధానికి చెందిన వారు. ఇలా ఎపుడు కలవని వీళ్లిద్దరిని ఈ సినిమాలో చూపెట్టి.. తప్పుడు చరిత్రను రుద్దారంటూ కొంత మంది సోషల్ మీడియాలో ఈ సినిమాను తెరకెక్కించిన వాళ్లపై రుసరుస లాడుతున్నారు. గతంలో నాగయ్య హీరోగా తెరకెక్కించిన చిత్రంలో కూడా ఇలానే చూపించారు. మొత్తంగా చరిత్రను వక్రీకరించి తెరకెక్కించిన శ్రీరామదాసు చిత్రం మంచి విజయాన్నే సాధించింది. (Twitter/Photo)
ఓం నమో వేంకటేశాయ | కే.రాఘవేంద్ర రావు, నాగార్జున కాంబినేషన్లో వచ్చిన *ఓం నమో వేంకటేశాయ’ సినిమా బాక్సాపీస్ దగ్గర సరైన ఫలితాన్ని రాబట్టలేదు. ఇది వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన 9వ సినిమా. ఈ సినిమాను రాఘవేంద్రరావు ‘హాతిరామ్ బాబా జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. తిరుమలలో ప్రస్తుతం ఉన్న ఆచార సంప్రదాయాలు ఈయనే ప్రవేశపెట్టిన అపర భక్తుడు. అంతేకాదు తిరుమల శ్రీవారే స్యయంగా ఈయనతో పాచికలు ఆట ఆడారు. గతంలో తెరకెక్కిన ‘శ్రీ వెంకటేవ్వర మహత్యం’ ‘శ్రీ తిరుపతి వేంకటేశ్వర స్వామి కళ్యాణం’ సినిమాల్లో కథ భాగంగా హాతిరామ్ బాబాజీ కథను ప్రస్తావించడం జరిగింది. (Twitter/Photo)