బిగ్ బాస్ ఓటిటి తెలుగు వస్తున్న సంగతి చాలా మందికి తెలుసో తెలియదో తెలియదు కానీ అప్పుడే నాలుగు వారాలు పూర్తి చేసుకోబోతుంది. నాలుగో వారం ఇంటి నుంచి ఎవరు బయటికి వెళ్లిపోతున్నారనే విషయంపై సోషల్ మీడియాలో చర్చ బాగానే జరుగుతుంది ఓటీటీ. నాన్ స్టాప్ షోతో అనుకున్న విధంగా వ్యూవర్ షిప్ అయితే రావడం లేదనే వాదన బలంగా వినిపిస్తుంది. అందుకే డోస్ ఇంకాస్త పెంచుతున్నాడు బిగ్ బాస్. నాలుగో వారం హౌజ్ నుంచి ఎవరు వెళ్లిపోతారనేది ఆసక్తికరంగా మారింది.
నిజానికి ఫోర్త్ వీక్ ఛాలెంజర్స్ నుంచి ఒకరు హౌస్ నుండి ఎలిమినేట్ అవుతారారని అందరు అనుకున్నారు. అందులో భాగంగా పెద్దగా పాపులారిటీ లేని మిత్ర శర్మ, అనిల్లలో ఎవరో ఒకరు ఇంటి నుంచి బయటకు రావడం పక్కా అనే వాదన కూడా వినిపించింది. కానీ అందరి అంచనాలు తలకిందలు చేస్తూ ఈ వారం ఛాలెంజర్స్ నుంచి కాకుండా వారియర్స్ నుంచి సరయు ఎలిమినేట్ కానుందనే వార్త చక్కర్లు కొడుతోంది. మరి ఇందులో ఎంత నిజం ఉందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. (Twitter/Photo)
బిగ్‌బాస్ ఓటీటీ తెలుగు షో గత నెల 26 నుంచి డిస్నీ హాట్ స్టార్‌లో అట్ఠహాసంగా ప్రారంభమైంది. నో కామా.. నో పులిస్టాప్.. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్గా బిగ్‌బాస్ ఓటీటీని నిరంతరాయంగా 84 రోజులు పాటు ఏకధాటిగా ప్రసారం కానుంది. అత్యంత ఆసక్తి కలిగించే హౌస్మేట్స్ కలిగిన బిగ్‌బాస్ హౌస్ ఈ సారి మీ చూపు తిప్పుకోనీయదు అంటూ హామి ఇచ్చింది. తెలుగు టీవీ అభిమానులు ఇప్పుడు వినోదాన్ని మరో స్థాయిలో ఆస్వాదించే రీతిలో బిగ్‌బాస్‌ను తీర్చిదిద్దినట్టు తెలిపారు.
బిగ్ బాస్ ఓటీటీ సీజన్ 12 వారాల పాటు కొనసాగనుంది. ఈ సందర్భంగా నాగార్జున వారంలో రెండు సార్లు అంటే 24 ఎపిసోడ్లు హౌస్‌ను విజిట్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఒక్కో ఎపిసోడ్‌కు రూ. 25 లక్షల చొప్పున మొత్తంగా రూ. 6 కోట్ల వరకు రెమ్యునరేషన్ నాగార్జునకు డిస్నీ హాట్ స్టార్ ఇవ్వనున్నట్టు సమాచారం. మొత్తంగా ఫ్లాప్ షోగా ముద్ర వేసుకున్న బిగ్‌బాస్ ఓటీటీలో భవిష్యత్తులో కంటిన్యూ చేయలేకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది.