Brahmastra | రాజమౌళి ‘బాహుబలి’ పుణ్యామా ఇపుడు దేశ వ్యాప్తంగా పలు భాషల్లో ప్యాన్ ఇండియా సినిమాలు తెరకెక్కుతున్నాయి. అందులో భాగంగా రాజమౌళి సమర్ఫకుడిగా కరణ్ జోహార్ నిర్మాణంలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బ్రహ్మాస్త్ర’ పలు వివాదాల నేపథ్యంలో సెప్టెంబర్ 9న విడుదలైంది. ఈ చిత్రానికి బ్యాడ్ టాక్ వచ్చినా.. ఓ మోస్తరు కలెక్షన్లు మాత్రం వచ్చాయి. తెలుగులో ఈ సినిమా మంచి వసూళ్లనే రాబట్టింది. థియేట్రికల్ రన్ ముగిసిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎంత రాబట్టిందంటే.. (Twitter/Photo)
బ్రహ్మస్త్ర చిత్రానికి సంబంధించి.. కంటెంట్ పరంగా వీక్.. కానీ గ్రాఫిక్స్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. షారుక్, అమితాబ్, నాగార్జున , మౌనీ రాయ్ వంటి ప్రముఖ నటులు ఈ సినిమాలో నటించారు. దీంతో వీరంతా చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా మారారు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు నాగార్జునతో పాటు రాజమౌళి సమర్ఫకుడిగా ఉండటం చూసి థియేటర్స్‌కు పరుగులు పెట్టారు.
ఏరియా వైజ్ బ్రహ్మాస్త్ర తెలుగు వెర్షన్ టోటల్ కలెక్షన్స్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం)లో రూ. 6.50 కోట్లు షేర్ రాయలసీమ (సీడెడ్)లో రూ. 1.46కోట్లు షేర్, ఉత్తరాంధ్ర రూ. 1.51 కోట్లు.. ఈస్ట్ గోదావరి - రూ. 0.97 కోట్లు.. వెస్ట్ గోదావరి - రూ. 0.63 కోట్లు గుంటూరు - రూ. 1.10 కోట్లు కృష్ణా - రూ. 0.68 కోట్లు.. నెల్లూరు రూ. 0.45 కోట్లు.. మొత్తంగా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి నాలుగు రోజుల్లో కలిపి రూ. 13.30 కోట్లు షేర్ (రూ. 26.35 కోట్ల గ్రాస్ వసూళ్లు) రాబట్టింది. (Twitter/Photo)
తెలుగులో రూ. 5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 5.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది. మొత్తంగా ఇప్పటి వరకు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని రూ. 7.8 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. ఇక దేశ వ్యాప్తంగా మూడు మల్టీప్లెక్స్ థియేటర్లలో బ్రహ్మస్త్రకు భారీ కలెక్షన్లు పొటేత్తాయి.తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మస్త్ర చిత్రం భారీగా వసూళ్లను రాబట్టాయి. మిగిలిన దక్షిణాది చిత్రాలను రూ. 30.60 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. (Twitter/Photo)
మొత్తంగా బ్రహ్మాస్త్ర సినిమా ఒరిజినల్ హిందీ వెర్షన్లో మాత్రం ఓ మోస్తరుగా నడిస్తే.. మిగతా భాషల్లో తక్కువ రేటుకు అమ్మడంతో ఈ సినిమా లాభాల్లోకి వచ్చింది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తొలి రోజు దేశవ్యాప్తంగా హిందీ, దక్షిణాది భాషల్లో 37 కోట్లు వసూలు చేసింది. ఇక రెండో రోజు ఈ చిత్రం 41 కోట్లు రాబట్టడంతో ఇండియాలోనే 78 కోట్లు రాబట్టిన చిత్రంగా రికార్డు సొంతం చేసుకొన్నది. (File/Photo)