సీనియర్ హీరో నాగార్జునకు ఈ మధ్య సరైన హిట్ పడలేదు. ఆ మధ్య ఘోస్ట్ అంటూ వచ్చారు. అయితే ఆ సినిమా అనుకున్న రేంజ్లో ఆకట్టుకోలేకపోయింది. దీంతో మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా బక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమైంది. దీంతో ఇక తన తదుపరి సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు నాగార్జున. అందులో భాగంగా రచయిత ప్రసన్న కుమార్ బెజావాడ దర్శకత్వంలో ఓ సినిమాకు రెడీ అవుతున్నారు. ఎలాగైన హిట్ కొట్టాలని కసిగా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారట. Photo : Twitter
అక్కినేని నాగార్జున గతేడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అందులో ‘సోగ్గాడే చిన్ని నాయన’ కి సీక్వెల్‌గా వచ్చిన ‘బంగార్రాజు’ కాగా.. మరో సినిమా ‘బ్రహ్మాస్త్ర’. రణ్‌బీర్ కపూర్ హీరోగా చేశారు. నాగార్జున ఇందులో అనీష్ శెట్టి అనే పాత్రలో స్పెషల్ రోల్ చేశారు. ఇక ఆయన హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా ది ఘోస్ట్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నాగ్ కెరీర్లో పెద్ద డిజాస్టర్ అయ్యింది. Photo : Twitter
ఇక ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న నాగార్జున బెజవాడ ప్రసన్నతో ఓ సినిమాను చేస్తున్నారు. ఇప్పటికే కథ కూడా ఓకే అవ్వడంతో త్వరలో షూటింగ్ షురూ చేయనుంది టీమ్. ఈ నేపథ్యంలో హీరోయిన్ను టీమ్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. మిస్ ఇండియా 2020 మాసన వారణాసిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నాగార్జున రెండు పాత్రల్లో కనిపించనున్నారట. ఈ నేపథ్యంలో యంగ్ నాగార్జున సరసన మానస నటించనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను ‘శ్రీనివాస సిల్వర్ స్క్రీన్’ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. Photo : Twitter
ఇటీవలే రవితేజతో బంపర్ హిట్ కొట్టఇన ప్రసన్న నాగార్జునతో ఓ రీమేక్ సినిమాను చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఇటీవల మలయాళంలో సూపర్ హిట్ అయిన పొరింజు మరియం జోస్ మూవీకి అఫీషియల్ రీమేక్ అని తెలుస్తోంది. మలయాళంలో జోజు జార్జి హీరోగా తెరకెక్కిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని మన తెలుగు నేటివిటీ కి తగ్గట్లుగా ప్రసన్న కుమార్ పలు మార్పులు చేర్పులు చేశారట. ఈ విషయంలో అతి త్వరలో అధికారిక ప్రకటన రానుంది. Photo : Twitter
ఇక గతేడాది నాగార్జున, తన పెద్ద తనయుడు నాగ చైతన్యతో కలిసి ‘బంగార్రాజు’ సినిమాతో పలకరించాడు. ఈ సినిమాలోనాగార్జున, నాగ చైతన్యలు తండ్రీ కొడుకులుగా, తాత మనవళ్లుగా కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘బ్రహ్మస్త్ర’ హిందీ సినిమాతో పలకరించారు. ఈ సినిమా మంచి విజయాన్నే సాధించింది. Photo : Twitter
ఇక పోయిన సంవత్సరం విజయ దశమి కానుగా విడుదలైన ‘ది ఘోస్ట్’ మూవీ మాత్రం నాగార్జునకు దారుణమైన ఫలితాన్ని అందించింది. ఈ మూవీ కలెక్షన్స్ చూసి నాగ్ ఇమేజ్ను ప్రశార్ధకం చేసింది. ఈ నేపథ్యంలో ఈయన మంచి స్క్రిప్ట్ ఉంటే కానీ సెట్స్ పైకి వెళ్లకూడదనే నిర్ణయానికి వచ్చాడు. తాజాగా నాగార్జునకు ఇద్దరు ముగ్గురు దర్శకులు చెప్పిన స్క్రిప్ట్ నచ్చి ఒక దానికి ఓకే చెప్పాడు. అందులో ఓ సినిమా తన చిన్న తనయుడు అఖిల్‌తో భారీ మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేసినట్టు సమాచారం. Photo : Twitter
ఘోస్ట్ విషయానికి వస్తే.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదలై ఘోరంగా విఫలమైంది. ‘ది ఘోస్ట్’ అనే మూవీలో ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రం దారుణమైన ఫలితాన్ని అందుకుంది. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ మరో కీలకపాత్రలో కనిపించారు.. Photo : Twitter (Twitter/Photo)
ఈ చిత్రాన్నిఉగాదికి కొబ్బరికాయ కొట్టి.. వచ్చే యేడాది సమ్మర్ కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నాడట. మొత్తంగా తండ్రీ తనయులైన నాగార్జున, అఖిల్‌లను పూర్తి స్థాయిలో ఒక సినిమాలో చూడాలనుకునే అభిమానులకు ఇది పసందైన న్యూసే. చూడాలి మరి ఈసినిమా ఎలా ఆకట్టకోనుందో.. గతంలో నాగార్జున, అఖిల్ మనంలో కలిసి నటించారు. ఇక అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ అనే సినిమాను చేస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శకుడు. Photo : Twitter
అక్కినేని నాగార్జున, మోహనరాజాతో చేయబోయే సినిమా 100వ సినిమా అనే ప్రచారం జరుగుతోంది. 1986లో విక్రమ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కెరీర్లో ఇప్పటి వరకు ఏ సినిమా విషయంలో అంతగా హడావుడి చేయలేదు. ఇక ఇప్పటి వరకు నాగ్.. తాను నటించిన 25వ సినిమా.. 50వ సినిమా.. 75వ సినిమా ఇది అని పెద్దగా హంగామా మాత్రం చేయలేదు. తన పని తాను చూసుకుపోతున్నారు. సినిమాల అంకెల విషయంలో పెద్దగా దృష్టి పెట్టలేదు. ఆ మధ్య బంగార్రాజు సినిమా ప్రమోషన్లో భాగంగా విలేఖరులు మీ వందో సినిమా ప్లాన్ ఏంటి అడగ్గానే.. సమయం వచ్చినపుడు చెబుతా అని దాటవేసారు. మరి అఖిల్‌తో చేయబోయే సినిమాను 100వ సినిమాగా అఫీషియల్‌గా ప్రకటిస్తారా లేదా అనేది చూడాలి. Photo : Twitter
అఖిల్‌తో సినిమా కంటే ముందు ధమాకా సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించిన బెజవాడ ప్రసన్నకుమార్‌తో ఓ సినిమాను పూర్తి చేస్తారట.. ఈ చిత్రంలో ఓ కీలకపాత్రలో అల్లరి నరేష్ కూడా నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారు. మార్చి లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభించి దసరాకు విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. గతంలో చెప్పినట్లు ఇది మలయాళీ సినిమాకు రీమేక్‌గా వస్తోందని తెలుస్తోంది. Photo : Twitter