‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా తర్వాత నాగార్జునకు సరైన విజయం లేదు. గతేడాది ‘వైల్డ్ డాగ్’ సినిమాతో పలకరించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు సరైన వసూళ్లు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతికి నాగార్జున తన తనయుడు ‘బంగార్రాజు’ సినిమాతో పలకరించారు. ఈ సినిమా సక్సెస్‌తో నాగార్జున బ్యాక్ బౌన్స్ అయ్యారనే చెప్పాలి. ఆ ఊపుతోనే ఇపుడు నాగ్.. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ సినిమా చేస్తున్నారు.
‘గరుడ వేగ’ తర్వాత ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేస్తోన్న మూవీ ‘ది ఘోస్ట్’. ఇపుడు నాగార్జునతో సాలిడ్ యాక్షన్ ఎంటర్టేనర్ తెరక్కిస్తున్నట్టు అర్ధం అవుతోంది. శతృవులను ఘోస్ట్ రూపంలో అంతమొందించే పాత్రలో నాగార్జున ఈ సినిమాలో కనిపించబోతున్నారు. అంతేకాదు పేరు కోసమే కాదు.. ఎంతో మంది దేశం కోసం అజ్ఞాతంగా పనిచేస్తున్నారు. వారందరినీ ఉద్దేశించి ‘ఘోస్ట్’ టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. (Twitter/Photo)
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా ‘ది ఘోస్ట్’ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ గోవాలో పూర్తైంది. రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతుంది. కథలో భాగంగా మన దేశంలోని ప్రధాన నగరాలు, విదేశాల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. (File/Photo)
‘ది ఘోస్ట్’ సినిమా తర్వాత నాగ్.. ‘బ్రహ్మాస్త్ర’ అనే ఓ హిందీ సినిమాలోను నటించారు. ఈ సినిమాలో రణ్‌బీర్‌కపూర్, ఆలియా భట్ నటించారు. నాగార్జున ఈ చిత్రంలో ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాతో పాటు మనం సినిమాకు సీక్వెల్ చేయనున్నట్టు సమాచారం. ఈ సినిమాకు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించనున్నారు. (File/Photo)