గతేడాది నాగార్జున, తన పెద్ద తనయుడు నాగ చైతన్యతో కలిసి ‘బంగార్రాజు’ సినిమాతో పలకరించాడు. ఈ సినిమాలోనాగార్జున, నాగ చైతన్యలు తండ్రీ కొడుకులుగా, తాత మనవళ్లుగా కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘బ్రహ్మస్త్ర’ హిందీ సినిమాతో పలకరించారు. ఈ సినిమా మంచి విజయాన్నే సాధించింది.
గతేడాది విజయ దశమి కానుగా విడుదలైన ‘ది ఘోస్ట్’ మూవీ మాత్రం నాగార్జునకు దారుణమైన ఫలితాన్ని అందించింది. ఈ మూవీ కలెక్షన్స్ చూసి నాగ్ ఇమేజ్ను ప్రశార్ధకం చేసింది. ఈ నేపథ్యంలో ఈయన మంచి స్క్రిప్ట్ ఉంటే కానీ సెట్స్ పైకి వెళ్లకూడదనే నిర్ణయానికి వచ్చాడు. తాజాగా నాగార్జునకు ఇద్దరు ముగ్గురు దర్శకులు చెప్పిన స్క్రిప్ట్ నచ్చి దానికి ఓకే చెప్పాడు. అందులో ఓ సినిమా తన చిన్న తనయుడు అఖిల్‌తో భారీ మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేసినట్టు సమాచారం. (Twitter/Photo)
నాగార్జున గతేడాది ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ అనే మూవీలో ఇంటర్ పోల్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రం దారుణమైన ఫలితాన్ని అందుకుంది. మరోవైపు అఖిల్ కూడా ‘ఏజెంట్’ సినిమాలో గూఢచారి పాత్రలో కనిపించన్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అఖిల్ ఏకంగా ఎయిట్ ప్యాక్ బాడీతో అదరగొట్టేసాడు. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. ఏప్రిల్ 28న ఈ సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. (Twitter/Photo)
అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్‌తో చేయబోయే సినిమా 100వ సినిమా అనే ప్రచారం జరుగుతోంది. 1986లో విక్రమ్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కెరీర్లో ఇప్పటి వరకు ఏ సినిమా విషయంలో అంతగా హడావుడి చేయలేదు. ఇక ఇప్పటి వరకు నాగ్.. తాను నటించిన 25వ సినిమా.. 50వ సినిమా.. 75వ సినిమా ఇది అని పెద్దగా హంగామా మాత్రం చేయలేదు. తన పని తాను చూసుకుపోతున్నారు. సినిమాల అంకెల విషయంలో పెద్దగా దృష్టి పెట్టలేదు. ఆ మధ్య బంగార్రాజు సినిమా ప్రమోషన్లో భాగంగా విలేఖరులు మీ వందో సినిమా ప్లాన్ ఏంటి అడగ్గానే.. సమయం వచ్చినపుడు చెబుతా అని దాటవేసారు. మరి అఖిల్‌తో చేయబోయే సినిమాను 100వ సినిమాగా అఫీషియల్‌గా ప్రకటిస్తారా లేదా అనేది చూడాలి. (Twitter/Photo)
మరోవైపు నాగార్జున .. ధమాకా సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించిన బెజవాడ ప్రసన్నకుమార్ చెప్పిన కథకు ఫిదా అయ్యాడట. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌తో తెరకెక్కోతోన్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ కూడా నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్నారు. మార్చి లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభించి దసరాకు విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. (Twitter/Photo)