Akkineni Nagarjuna: కరోనా కాలంలో షూటింగ్స్ అంటే అంతా భయపడుతున్నారు. మొన్నటి వరకు మొండిగా చేసిన కొందరు హీరోలు కూడా ఇప్పుడు హోమ్ క్వారంటైన్కే పరిమితం అయిపోయారు. ఇలాంటి డేంజర్ టైమ్‌లో నాగార్జున(Nagarjuna) రిస్క్ తీసుకుంటున్నాడు.. షూటింగ్ అంటున్నాడు.
కరోనా కాలంలో షూటింగ్స్ అంటే అంతా భయపడుతున్నారు. మొన్నటి వరకు మొండిగా చేసిన కొందరు హీరోలు కూడా ఇప్పుడు హోమ్ క్వారంటైన్కే పరిమితం అయిపోయారు. యంగ్ హీరోలు సైతం ఇంట్లోనే ఉండిపోయారు.
2/ 8
ఇప్పుడున్న పరిస్థితుల్లో బయటికి వచ్చి లేనిపోని కరోనాలు అంటించుకోవడం కంటే హాయిగా ఇంట్లో కూర్చోవడమే మంచిదని అంతా నిర్ణయించుకున్నారు. అందుకే కొన్ని రోజులుగా టాలీవుడ్లో షూటింగ్ అనే మాటే వినిపించట్లేదు.
3/ 8
ఇదిలా ఉంటే ఇలాంటి సమయంలో షూటింగ్ మొదలు పెట్టాలంటే ధైర్యం కావాలి. అందులోనూ 60 ప్లస్ హీరోలు అయితే రిస్క్ తీసుకున్నట్లే. ఇప్పుడు ఆ రిస్క్‌కు రెడీ అంటున్నాడు నాగార్జున. ఆయన గట్స్ చూస్తుంటే అంతా షాక్ అవుతున్నారు.
4/ 8
కోవిడ్ దెబ్బకు 30 లోపు వాళ్లే వణికిపోతుంటే 60 దాటిన ఈయన ముందడుగు వేస్తున్నాడు. గతేడాది మొదటి వేవ్ వచ్చినపుడు కూడా వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ తక్కువ మందితో పూర్తి చేసాడు. ఇప్పుడు ఇలాంటి సెకండ్ వేవ్ పరిస్థితుల్లోనూ తన సినిమా షూటింగ్ మొదలు పెట్టాలని చూస్తున్నాడు.
5/ 8
ప్రస్తుతం ఈయన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం విదేశాలకు వెళ్లనున్నాడు నాగార్జున. జూన్ రెండో వారంలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెడుతున్నారు. దేశంలో రోజువారీ కేసులు 3 లక్షలకు పైగానే వస్తున్నాయి.
6/ 8
మన తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. ఇన్ని ఉన్నా కూడా నాగార్జున మాత్రం తన కొత్త సినిమా షూటింగ్ మాత్రం మొదలు పెడుతున్నాడు. జూన్ రెండో వారంలో ప్రవీణ్ సినిమా కోసం ఫారెన్ వెళ్లనున్నాడు.
7/ 8
తొలి షెడ్యూల్ ఫిబ్రవరిలో మొదలు పెట్టారు. హైదరాబాద్, గోవాలలో పూర్తి చేసారు. ఇప్పుడు రెండో షెడ్యూల్ మొదలెట్టేస్తున్నారు. ఈ సమయంలో కూడా నాగార్జున తీసుకుంటున్న రిస్క్ చూసి ఔరా అంటున్నారు అంతా.
8/ 8
కానీ అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే షూటింగ్ చేస్తామంటున్నారు నాగార్జున యూనిట్. రాజశేఖర్ గరుడ వేగ తర్వాత ఈయన చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.