Nagarjuna: టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జునకు గోవా రాష్ట్రంలోని ఓ గ్రామ పంచాయితీ షాక్ ఇచ్చింది. రీసెంట్గా నాగార్జన తెలంగాణ ప్రభుత్వం రైతులకు అందజేస్తోన్న రైతు బంధు పథకం ద్వారా లాభం పొందుతున్నారనే ఆరోపణలొచ్చాయి. ఆ సంగతి మరవక ముందే గోవా రాష్ట్రంలోని ఓ గ్రామ పంచాయితీ నాగార్జునకు అక్రమ నిర్మాణాలకు పాల్పడ్డానే ఆరోపణలతో నోటీసులు జారీ చేసింది. (Twitter/Photo)
నాగార్జున అక్కినేని సినిమాల విషయానికొకస్తే.. ఈయన ఓ వైపు సినిమాలు చేస్తూనే.. బిగ్ బాస్ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈయన ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ స్పె థ్రిల్లర్ ఘోస్ట్. ఈ సినిమా మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా అక్టోబర్ 5 న విడుదలై బాక్సాఫీస్ దగ్గర దారుణమైన ఫలితాన్ని చవి చూసింది. నాగార్జున ఇమేజ్‌కు తగ్గ కలెక్షన్స్‌ను కూడా రాబట్టలేకపోయింది. మంచి బజ్‌తో వచ్చిన ఈ సినిమాలో నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటించారు. ఈ సినిమాకు ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. Photo : Twitter
ఈ సినిమా టోటల్ రన్లో రూ. 6.5 కోట్ల నుంచి రూ. 7 కోట్ల వరకు షేర్ రాబట్టింది. ఈ సినిమా రూ. 21.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 22 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగిన ఈ సినిమా ఓవరాల్‌గా రూ. 16 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది. థియేట్రికల్‌గా ఫెయిల్ అయిన ఈ చిత్రం ఓటీటీ వేదికగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. (Twitter/Photo)
ఈ సినిమాలో నాగార్జునతో పాటు సోనాలీ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్, రవివర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్‌స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్‌లతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. (The Ghost Twitter)
ఈ సినిమాకు మార్క్ కె రాబిన్ సంగీతం అందిచారు.. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మొదటి రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. మొత్తంగా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి మొదటి రోజు కలిపి రూ. 2 కోట్లు షేర్ (రూ. .3.60 కోట్ల గ్రాస్ వసూళ్లు) రాబట్టింది. నాగార్జున రేంజ్‌కు ఇంత తక్కువగా కలెక్షన్స్ రావడం ఏంటీ అని అశ్చర్యపోయారు ట్రేడ్ పండితులు..
సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా తర్వాత నాగార్జునకు సరైన విజయం లేదు. గతేడాది ‘వైల్డ్ డాగ్’ సినిమాతో పలకరించారు. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు సరైన వసూళ్లు దక్కలేదు. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతికి నాగార్జున తన తనయుడు ‘బంగార్రాజు’ సినిమాతో పలకరించారు. ఈ సినిమా సక్సెస్‌తో నాగార్జున బ్యాక్ బౌన్స్ అయ్యారనే చెప్పాలి. ఇక బ్రహ్మాస్త్ర సినిమాలో నాగ్ పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్గా విడుదలైన ‘ది ఘోస్ట్ సినిమా మాత్రం నాగార్జునకు థియేట్రికల్‌గా నిరాశనే మిగిల్చింది. (File/Photo)