Shiva: తెలుగులో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన నాగార్జున, రామ్ గోపాల్ వర్మల ‘శివ’..
Shiva: తెలుగులో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన నాగార్జున, రామ్ గోపాల్ వర్మల ‘శివ’..
Nagarjuna Akkineni Amala RGV Shiva Movie | తెలుగులో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన నాగార్జున, రామ్ గోపాల్ వర్మల ‘శివ’ మూవీ.. ఈ మూవీ రిలీజై నేటికి 31 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ‘శివ’ సినిమా విశేషాలు..
తెలుగులో సరికొత్త ట్రెండ్ క్రియేట్ చేసిన నాగార్జున, రామ్ గోపాల్ వర్మల ‘శివ’ మూవీ.. ఈ మూవీ రిలీజై నేటికి 31 యేళ్లు పూర్తి చేసుకుంది. (Twitter/Photo)
2/ 14
అప్పటి వరకు ఒక మూసలో పోతున్న తెలుగు సినిమాను ‘శివ’ సినిమాతో పూర్తిగా మార్చేసాడు రామ్ గోపాల్ వర్మ. అప్పటి వరకు తెలుగు సినిమాల్లో ఫైట్లు, సీన్లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ రకంగా ఉండాలన్న దానికి ‘శివ’ సినిమాతో బ్రేక్ చేసాడు రామ్ గోపాల్ వర్మ. (Twitter/Photo)
3/ 14
మొత్తంగా తెలుగు సినిమా చరిత్రను చెప్పాలంటే ‘శివ’ సినిమాకు ముందు తర్వాత అనేంతలా టాలీవుడ్ పై తనదైన ముద్ర వేసాడు రామ్ గోపాల్ వర్మ. (Twitter/Photo)
4/ 14
అంతేకాదు తెలుగు సినిమా చరిత్రలోనే ఒక క్లాసిక్‌గా నిలిచిపోయింది ‘శివ’ మూవీ. ఈ సినిమా 1989 అక్టోబర్ 5న విడుదలైంది. ఎన్నో రికార్డులను బ్రేక్ చేసింది శివ మూవీ. (Twitter/Photo)
5/ 14
ఈ సినిమాలో హీరో నాగార్జున సైకిల్ చైన్ తెంపి విలన్స్ భరతం పట్టే సీన్ ఎవర్ గ్రీన్. అంతేకాదు తెలుగులో సౌండ్ ఎఫెక్ట్ పై ఎక్కువగా ఫోకస్ పెట్టిన చిత్రంగా నిలిచింది. (Twitter/Photo)
6/ 14
‘శివ’ సినిమా హీరో నాగార్జునకు స్టార్ హీరో స్టేటస్ అందుకున్నాడు. ఈ సినిమాతో టాలీవుడ్ టాప్ హీరో లీగ్‌లో చేరాడు. ఈ చిత్రానికి ఎస్.గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ పెద్ద ఎస్పెట్గా నిలిచింది. (Twitter/Photo)
7/ 14
‘శివ’ సినిమా ఆరు కేంద్రాల్లో యేడాది పైగా నడిచి రికార్డు క్రియేట్ చేసింది. 22 సెంటర్స్‌లో 100 రోజులుకు పైగా నడిచింది. (Twitter/Photo)
8/ 14
‘శివ’ సినిమాను తమిళంలో అదే టైటిల్‌తో డబ్ చేస్తే అక్కడ సూపర్ హిట్టైయింది. ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తాను విజయవాడలో చదువుకున్న కాలేజీలో చూసిన, విన్న కాలేజీ గొడవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. (Twitter/Photo)
9/ 14
‘శివ’ సినిమా హిందీ రీమేక్‌తో నాగార్జునతో పాటు రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. (Twitter/Photo)
10/ 14
హిందీలో కూడా ‘శివ’ మంచి ఫలితాన్నే అందుకుంది. తెలుగులో ఈ చిత్రాన్ని వర్మ 55 రోజుల్లో కంప్లీట్ చేసాడు. కేవలం మూడు రోజులు మాత్రమే చెన్నైలో షూట్ చేసారు. మిగిలిన భాగాన్ని తెలుగు రాష్ట్రాల్లో పిక్చరైజ్ చేసాడు వర్మ. (Twitter/Photo)
11/ 14
ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది. తెలుగుతో పాటు హిందీలో కూడా ఇళయరాజనే అద్భుతమైన సంగీతం అందించారు. ఈ చిత్రం పలు చిత్రోత్సవాల్లో పాల్గొని ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది. (Twitter/Photo)
12/ 14
నాగార్జున, అమల ‘శివ’ తెలుగుతో పాటు హిందీ రీమేక్‌లో జోడిగా నటించారు. అంతేకాదు భార్య భర్తలైన హీరో, హీరోయిన్లు.. రెండు భాషల్లో వాళ్లే హీరో, హీరోయిన్లుగా నటించడం రేర్ అనే చెప్పాలి. ఇక విలన్‌గా రఘువరన్ యాక్టింగ్ గురించి సెపరేట్‌గా చెప్పాలి. (File/Photo)
13/ 14
ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్,ఎస్ఎస్ క్రియేషన్స్ పతాకంపై నాగార్జున అన్నాబావలైన అక్కినేని వెంకట్,యార్లగడ్డ సురేంద్ర నిర్మించారు. (Twitter/Photo)
14/ 14
‘శివ’ సినిమాతో జెడి చక్రవర్తి, ఉత్తేజ్ వంటి ఎంతో మంది కొత్త నటీనటులు టాలీవుడ్‌కు పరిచయమయ్యారు.(Twitter/Photo)