Krishna Vrinda Vihari Closing Collections: నాగ శౌర్య టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగు పెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్గా ‘కృష్ణ వ్రిందా విహారి’ సినిమాతో పలకరించాడు. మరికొన్ని గంటల్లో ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టోటల్ రన్లో ఎంత రాబట్టిందంటే.. (Twitter/Photo)
మరికొన్ని గంటల్లో ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న కృష్ణ వ్రిందా విహారి టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే.. తెలంగాణ (నైజాం)లో రూ. 1.75 కోట్లు షేర్ రాయలసీమ (సీడెడ్)లో రూ. 0.38కోట్లు షేర్, ఉత్తరాంధ్ర రూ. 0.43 కోట్లు.. ఈస్ట్ గోదావరి - రూ. 0.31 కోట్లు.. వెస్ట్ గోదావరి - రూ. 0.19 కోట్లు గుంటూరు - రూ. 0.31 కోట్లు కృష్ణా - రూ. 0.30 కోట్లు.. నెల్లూరు రూ. 0.13 కోట్లు.. మొత్తంగా తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 3.80 కోట్లు షేర్ (రూ. 6.65 కోట్ల గ్రాస్ వసూళ్లు) రాబట్టింది. కర్ణాటక+ రెస్టాఫ్ భారత్ రూ. 0.20 కోట్లు.. ఓవర్సీస్ రూ. 0.72 కోట్లు..మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 4.72 కోట్లు షేర్ (రూ. 8.90 కోట్లు గ్రాస్) వసూళ్లను రాబట్టింది.(Twitter/Photo)