షూటింగ్లో నాగశౌర్య సొమ్మసిల్లి పడిపోయాడని తెలుస్తోంది. దీంతో వెంటనే అతడ్ని చికిత్స నిమిత్తం గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. నాగశౌర్య అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా ఈయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాలేదని సమాచారం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా అడుగు పెట్టి తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్గా ‘కృష్ణ వ్రిందా విహారి’ సినిమాతో పలకరించాడు. తూర్పు గోదావరి జిల్లా ఏలూరిలో పుట్టిన ఇతను.. విజయవాడలో పెరిగాడు. ఆ తర్వాతా వీరి ఫ్యామిలీ హైదరాబాద్కు షిప్ట్ అయింది. ఇక నాగ శౌర్య 2011లో వచ్చిన ‘క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్’ చిత్రంతో నటుడిగా పరిచయమయ్యాడు. (Twitter/Photo)