NAGA CHAITANYA TAMANNAAH SUKUMARS TA 100 PERCENT LOVE MOVIE COMPLETES 10 YEARS TA
Naga Chaitanya -Sukumar: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న నాగ చైతన్య, తమన్నా, సుకుమార్‌ల 100 % మూవీ..
Naga Chaitanya -Sukumar: నాగ చైతన్య, తమన్నా హీరో, హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 100 % లవ్ సినిమా నేటితో 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలు..
Naga Chaitanya -Sukumar: నాగ చైతన్య, తమన్నా హీరో, హీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 100 % లవ్ సినిమా నేటితో 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలు.. (Twitter/Photo)
2/ 9
‘ఏమాయా చేసావే’ తర్వాత నాగ చైతన్య హీరోగా నటించిన 100 % లవ్ సినిమా చైతూకు లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చిపెట్టింది. హీరోగా నాగ చైతన్యకు ఇది 3వ చిత్రం. (Twitter/Photo)
3/ 9
100 % లవ్ ఆడియో వేడుకలో అక్కినేని నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై మనవడు నాగ చైతన్యకు బెస్ట్ విషెస్ అందజేసారు. అంతేకాదు తాత, నాన్నల అక్కినేని మూడో తరంలో రొమాంటిక్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు నాగ చైతన్య. (Twitter/Photo)
4/ 9
నాగ చైతన్య, తమన్నా, సుకుమార్ కాంబినేషన్ల తొలి చిత్రం. బాలు, మహాలక్ష్మి పాత్రల్లో నాగ చైతన్య, తమన్నాల యాక్టింగ్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. (Twitter/Photo)
5/ 9
ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ సమర్ఫణలో బన్ని వాసు నిర్మించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని నమోదు చేసింది. (Twitter/Photo)
6/ 9
ఈ చిత్రాన్ని తమిళంలో 100% కాదల్ పేరుతో రీమేక్ చేసారు. మరోవైపు బెంగాలీలో కూడా ఈ చిత్రాన్ని రీమేక్ చేసారు. మలయాళంలో ఈ చిత్రాన్ని సేమ్ టైటిల్‌తో డబ్ చేసి రిలీజ్ చేసారు. (Twitter/Photo)
7/ 9
ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. (Twitter/Photo)
8/ 9
పదేళ్లు పూర్తి చేసుకున్న నాగ చైతన్య, తమన్నా, సుకుమార్‌ల 100 % లవ్ సినిమా. (Twitter/Photo)
9/ 9
నాగ చైతన్య, తమన్నా 100 % లవ్ తర్వాత ‘తడాఖా’ సినిమాలో కలిసి నటించారు. (Twitter/Photo)