Naga Chaitanya - Samnatha : సమంత కాకుండా ముందుగా నాగ చైతన్య ఆ హీరోయిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడా..అంటే ఔననే అంటున్నాయి. సినీ ఇండస్ట్రీలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరగుతాయో.. విడాకులు కూడా అంతే జెడ్ స్పీడ్‌లో జరిగిపోతుంటాయి. ఈ కోవలోనే అందమైన అద్భుతమైన జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య, సమంత విడిపోతున్నట్టు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు.
అంతకు కొన్ని రోజులు ముందు సమంత తన పేరులోని అక్కినేని పేరు తొలిగించడంతో ఈ అనిశ్చితి నెలకొంది. ఇక అప్పటి నుంచి వీళ్లిద్దరు విడిపోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. దీంతో వీళ్లిద్దరు విడిపోయినా.. సగటు సినీ ప్రేమికుడు అంతగా షాక్‌కు గురికాలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వాళ్ల గురించి ఇప్పటికీ చర్చ జరుగుతూనే ఉంది.
తెలుగు ఇండస్ట్రీలో కొన్ని రోజుల నుంచి నాగ చైతన్య, సమంత గురించి టాపిక్స్ నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళెందుకు విడిపోయారనే విషయంపై ఎవరికి తోచింది వాళ్లు చెప్తూనే ఉన్నారు. మరికొందరు అయితే ఏకంగా డిబేట్స్ పెట్టి.. ఖచ్చితమైన కారణాలు ఇవే అంటూ కుండ బద్దలు కొడుతున్నారు. సమంత పిల్లలు కనడానికి ఒప్పుకోలేదని.. సరోగసి వైపు అడుగులు వేసినందుకే చైతూ ఈ నిర్ణయం తీసుకున్నాడని కొందరు చెప్తున్న కారణం.
విడాకులు తీసుకున్న తర్వాత కూడా నాగ చైతన్య, సమంత ఇద్దరూ వార్తల్లోనే ఉంటున్నారు. సోషల్ మీడియాలో ఇద్దరూ ట్రెండింగ్‌లోనే ఉన్నారు. ముఖ్యంగా వాళ్లు చేస్తున్న పనులే నెటిజన్స్ నోళ్లలో నానేలా చేస్తున్నాయి. విడాకుల తర్వాత తన పని తాను చేసుకుంటున్నాడు చైతూ. ఓ వైపు ఫ్యామిలీ పార్టీలు.. మరోవైపు తన సినిమాలతో బిజీ అయిపోయాడు. కానీ సమంత మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది.
విడాకుల తర్వతా సమంత సినిమాల విషయంలో దూకుడు పెంచింది. అంతేకాదు సోషల్ మీడియాలో హాట్ ఫోటో షూట్స్‌తో రచ్చ చేస్తూనే ఉంది. అంతేకాదు తెలుగులో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వలో తెరకెక్కుతోన్న ’పుష్ప’లో ఫస్ట్ టైమ్ ఐటెం సాంగ్ చేస్తోంది. దాంతో పాటు కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఈ భామకు ఆఫర్స్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. (Twitter/Photo)
ఐతే.. సమంత పెళ్లి చేసుకోకముందు నాగ చైతన్య హీరోయిన్ కమల్ హాసన్ కూతురు శృతి హాసన్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడట. అంతేకాదు 2018 ‘ప్రేమమ్’లో వీళ్లిద్దరు జోడిగా నటించారు. అంతకు ముందు 2013 నుంచి వీళ్లిద్దరు డేట్లో ఉన్నట్టు సమాచారం. కానీ వీళ్లిద్దరి ప్రేమ పెళ్లి వరకు వెళ్లలేదు. ఆ తర్వాత సమంతను నాగ చైతన్య ప్రేమ వివాహాం చేసుకున్నారు. వీళ్లిద్దరి పెళ్లి హిందూ, క్రిస్టియన్ రెండు పద్ధతుల్లో జరిగింది. (Twitter/Photo)