ఓ దశలో విడాకుల నిర్ణయం తర్వాత చనిపోతానేమో అని అనిపించిందని కూడా చెప్పారు సమంత. మరోవైపు నాగచైతన్య మాత్రం విడాకుల తర్వాత ఎప్పుడూ మీడియా ముందు నోరు మెదపలేదు. కాగా మొదటిసారిగా నాగ చైతన్య విడాకులపై స్పందించారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన నటిస్తున్న బంగార్రాజు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడాకులపై స్పందించారు నాగ చైతన్య. Photo : Twitter
విడాకులపై మాట్లాడుతూ.. ఇద్దరి మంచి కోసమే విడాకుల నిర్ణయం తీసుకున్నామని తెలిపారు చైతన్య. విడాకుల తర్వాత తను సంతోషంగా ఉంది. నేను కూడా సంతోషంగా ఉన్నాను.. విడాకుల నిర్ణయం మా ఇద్దరికీ బెస్ట్ డెసిషన్ అని చెప్పారు చైతన్య. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Twitter
ఇక నాగ చైతన్య, నాగార్జునలు కలిసి బంగార్రాజు మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో యంగ్ నాగార్జున పాత్రలో ఆయన తనయుడు నాగ చైతన్య నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌కు ఆడియన్స్ నుండి అదిరే రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. బంగార్రాజు జనవరి 15న విడుదలకానుందని చిత్రబృందం ప్రకటించింది. Photo : Twitter
ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ వచ్చింది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ సినిమా రెండు గంటల నలబై నిమిషాల నిడివితో రానుంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు ఊహించని బిజినెస్ జరిగిందని అంటున్నారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమా దాదాపు 5 ఏళ్ళకి వస్తున్న ఈ సీక్వెల్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. Photo : Twitter
అందుకు తగ్గట్లుగానే బిజినెస్ జరుగుతోందని అంటున్నారు. ఈ సినిమా ముందు తెలుగు రాష్ట్రాలలో 22 కోట్ల నుండి 25 కోట్ల రేంజ్లో బిజినెస్ అయ్యిండేది అనుకున్నా.. ప్రస్తుతం ఎలాంటీ సినిమాలు లేకపోవడంతో అన్ని ఏరియాలలో ఇప్పుడు మంచి ఆఫర్స్ వస్తున్నాయని అంటున్నారు. దీంతో ఈ సినిమా ఇప్పుడు 30 నుంచి 35 కోట్ల వరకు బిజినెస్ చేసే అవకాశం ఉందని టాక్. దీంతో నాగార్జున కెరీర్లో ఇది హైయెస్ట్ బిజినెస్ అని అంటున్నారు. చూడాలి మరి ఈ సినిమా ఎలా వసూళ్లను రాబట్టనుందో.. Photo : Twitter
ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మరో సాంగ్ లిరికల్ విడుదలైంది. వాసివాడి తస్సాదియ్యా అంటూ సాగే ఈ పాట మాస్కు ముఖ్యంగా అక్కినేని ఫ్యాన్స్‌కు నచ్చుతుంది. నిన్న టీజర్‌ను విడుదల చేయగా.. పూర్తి పాటను డిసెంబర్ 19న విడుదల చేశారు. ఈ పాటను కళ్యాణ కృష్ణ కురసాల రాయగా.. మోహన బోగరాజు, సాహితి పాడారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. Photo : Twitter