Naga Chaitanya : ’లవ్ స్టోరీ’ ప్రమోషన్లో భాగంగా తన సతీమణి సమంత విషయమై స్పందించిన నాగ చైతన్య.. ప్రస్తుతం నాగ చైతన్య.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ సినిమా చేసారు. ఈ సినిమాలో చైతూ సరసన సాయి పల్లవి కథానాయికగా నటించింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా సినిమాతో పాటు సమంత గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సినిమా మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. (Twitter/Photo)
ప్రొఫెషనల్ లైఫ్‌ను పర్సనల్ లైఫ్‌తో వేరుగా చూడటం అనేది నాన్న నాగార్జునతో పాటు మామ వెంకటేష్‌ను చూసి నేర్చుకున్నట్టు తెలిపారు. అంతేకాదు ఇంట్లో వాళ్లు సినిమా షూటింగ్స్‌తో పాటు ఇతర బిజినెస్ విషయాలు చూసుకొని వచ్చిన తర్వాత ఆ విషయాలను ఇంట్లో ప్రస్తావించే వారు కాదు. అదే నేను అలవాటు చేసుకున్నాను. (Twitter/Photo)
సోషల్ మీడియాలో తనపై తన ఫ్యామిలీపై వస్తోన్న కొన్ని తప్పుడు వార్తలు చేసి బాధ పడ్డాను. నా గురించి మీడియాలో ఇలాంటి వార్తలు ఎలా రాస్తున్నారా అని ఆశ్యర్యపోయిన సందర్భాలున్నాయి. పాత రోజుల్లో మ్యాగజైన్స్ వచ్చేవి. అందులో ఒక నెలంతా అలాంటి వార్తలు ఉండేవి. ఇపుడు ట్రెండ్ మారింది. ఒక వార్తను మరో వార్త కవర్ చేస్తున్న విషయాన్ని ప్రస్తావించారు. (Twitter/Photo)