Naga Chaitanya: నాగచైతన్య పెళ్లి చేసుకునేది ఈ హీరోయిన్నే.. వైరల్ అవుతున్న పిక్స్
Naga Chaitanya: నాగచైతన్య పెళ్లి చేసుకునేది ఈ హీరోయిన్నే.. వైరల్ అవుతున్న పిక్స్
Naga Chaitanya Second Marriage: సమంత లైఫ్‌లో మజిలీ సినిమా నిజమవుతుందా ?అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. నాగ చైతన్య మజిలీ సినిమాలో నటించిన హీరోయిన్ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నాగచైతన్య, సమంత,దివ్యాంశ కౌశిక్ కలిసి తీసిన సినిమా మజిలీ. అయితే ఈ సినిమాలో చైతు, దివ్యాంశ ఉన్న ఫోటోలు గత కొన్ని రోజులుగా వైరల్ అవుతున్నాయి,
2/ 7
మజిలీ సినిమాకు ముందే.. నాగచైతన్య, పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరిది ప్రేమ వివాహం అయితే కొన్ని మనస్పర్థల కారణంగా చైతు, సామ్ విడిపోయారు. విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.
3/ 7
సమంత-నాగచైతన్య పెళ్లయి 4 ఏళ్లు తర్వాత.. వీరిద్దరు తమ వివాహ బంధానికి ఎండ్ కార్డు వేశారు. విడాకులు తీసుకుని వేర్వేరు అయిపోయారు. దీంతో ఇప్పుడు చైతు మరో మరో పెళ్లికి సిద్ధమయ్యాడన్న వార్త ఒకటి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
4/ 7
అయితే నాగ చైతన్య మాత్రం ఇంతవరకు రెండో పెళ్లి వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. నాగ చైతన్య,సమంతల 'మజిలీ'లో నటించిన దివ్యాంశ కౌశిక్‌ను నాగ చైతన్య వివాహం చేసుకోనున్నట్లు సమాచారం.
5/ 7
తాజాగా మజిలీ ముద్దుగుమ్మతో నాగ చైతన్య చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నట్లు సమాచారం. 'మజిలీ'లో నాగ చైతన్య ప్రియురాలి పాత్రలో దివ్యాంశ కౌశిక్ నటించింది. సమంత భార్యగా నటించింది.
6/ 7
నాగ చైతన్య , దివ్యాంశ కౌశిక్ కలిసి ఉన్న ఫోటో కొన్ని రోజుల క్రితం సోషల్ నెట్వర్కింగ్ సైట్లో వైరల్ అయ్యింది. నాగ చైతన్య హీరోగా పేరు పెట్టని సినిమాలో నాగ చైతన్య, దివ్యం జంటగా నటించనున్నారు.
7/ 7
సమంతకు విడాకులు ఇచ్చిన తర్వాత చైతు సైతం సినిమాల్లో బిజీగా మారాడు. ‘థ్యాంక్యూ’ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. నాగ చైతన్య నటించిన తొలి హిందీ చిత్రం 'లాల్ సింగ్ ఛద్దా' ఆగస్టులో విడుదల కానుంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య ఓ కొత్త సినిమాలో నటించనున్నాడు.