అక్కినేని నటవారసుడు నాగ చైతన్య హీరోగా ఇప్పటికే పలు సినిమాలు షూటింగ్‌లను జరుపుకుంటున్నాయి. మరికొన్ని విడుదలకు రెడీ అవుతున్నాయి. ఇక తాజాగా ఆయన మరో సినిమాను ప్రారంభించారు. తాజాగా చైతన్య లైనప్‌లో తమిళ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు వెంకట్ ప్రభు కూడా వచ్చి చేరారు. నాగచైతన్య 22వ సినిమాను వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేయనున్నారు. Photo : Twitter
ఈ సినిమా ఈరోజు పూజా కార్యక్రమాలతో మొదలైంది. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను క్లాప్ ఇవ్వగా.. హీరో, హీరోయిన్లు పాల్గోన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ కృతి శెట్టి ని ఎంపిక చేసినట్టుగా ఇప్పుడు అనౌన్స్ చేశారు. దీనితో కాంబో నుంచి మరో సినిమా రాబోతుంది అని చెప్పాలి. ఈ ఏడాదిలోనే ఈ ఇద్దరు హీరో హీరోయిన్ లు నటించిన “బంగార్రాజు” మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.Photo : Twitter
ఇక నాగ చైతన్య (Naga Chaitanya) సినిమాల విషయానికి వస్తే.. ఆయన గత యేడాది ‘లవ్ స్టోరీ’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. ఇక ఇటీవల సంక్రాంతి కానుకగా తన తండ్రి నాగార్జునతో కలిసి ఈయన చేసిన సినిమా బంగార్రాజు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఇక ’మజిలీ’ తర్వాత ’లవ్ స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్‌లతో కెరీర్లో ఫస్ట్ హాట్రిక్ అందుకున్నాడు. Photo : Twitter
అంతకు ముందు ’వెంకీ మామ’ సినిమా కూడా సక్సెస్ అయింది. అది కలుపుకుంటే వరుసగా నాలుగు హిట్స్ అందుకున్నట్టు లెక్క. ఇక అది అలా ఉంటే నాగ చైతన్య ప్రస్తుతం (Vikram K Kumar ) విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి (Thank You Teaser ) టీజర్ విడుదలైంది. టీజర్ నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. జీవితంలో అహంకారం ఉన్న ధనిక వ్యాపారవేత్తగా నాగ చైతన్య అదరగొట్టారు. Photo : Twitter
జీవితంలో చాలా కాంప్రమైజ్ అయ్యాను.. ఇక అయ్యేది లేదంటూ నాగ చైతన్య (Naga Chaitanya ) డైలాగ్ అదిరిందని అంటున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్యతో పాటు ఇతర ముఖ్య పాత్రల్లో అవికా గోర్, మాళవిక నాయర్, (Raashi Khanna) రాశీ ఖన్నా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలైలో విడుదలకు రెడీ అవుతోంది. Photo : Twitter
ఇక మరో వైపు నాగ చైతన్య సినిమాలు చేస్తూనే మరోవైపు ఓ వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ కోసం ఆయన విక్రమ్ కె.కుమార్‌తో కలిసి ఓ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో వెబ్ సిరీస్ చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్‌కు ‘ధూత’ అనే టైటిల్ కన్ఫామ్ చేసారు. ఈ వెబ్ సిరీస్‌ను మొత్తం 24-30 ఎపిసోడ్లతో 3 సీజన్లుగా తెరకెక్కించనున్నారట. ఈ వెబ్ సిరీస్‌లో నాగ చైతన్య పాత్ర రెండు షేడ్స్‌లో ఉంటుందని అంటున్నారు. Photo : Twitter