హైదరాబాద్‌లో థాంక్యూ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు నాగ చైతన్య సమాధానం ఇచ్చారు. ఓ అభిమాని చైతుని ఓ ప్రశ్న అడిగారు. కొత్త సినిమా రిలీజ్ అయినప్పుడల్లా క్రాస్ రోడ్స్ థియేటర్లకు వెళ్లి హంగామా చేస్తామన్నారు ఫ్యాన్స్. అయితే ఈసారి నువ్వు కూడా రావాలంటూ.. నాగచైతన్యను అభిమాని రిక్వెస్ట్ చేశారు.
ఒక మనిషిని పట్టుకుని వేలాడే ప్రేమకంటే స్వేచ్ఛగా వదిలేయగలిగే ప్రేమ ఎంతో గొప్పది అంటూ ట్రైలర్లో చైతన్య చెప్పిన డైలాగ్ హైలెట్‌గా నిలిచింది. ట్రైలర్ విడుదల వేడుకలో నాగ చైతన్య మాట్లాడుతూ అభిరామ్ ప్రయాణమే ఈ సినిమా. ఓ నటుడిగా ఇన్ని వేరియేషన్స చూపించడానికి, విభిన్నమైన లుక్స్‌లో కనిపించడానికి ప్రతిసారీ అవకాశం రాదు. ఈ చిత్రంతో తనకు ఈ అవకాశం దొరికిందన్నారు.
తను లేకపోతే అభి ప్రయాణం ఉండదు. దిల్‌రాజు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. ఈ చిత్రం కోసం సహకరించిన చిత్ర బృందం మొత్తానికి నాగ చైతన్య థాంక్యూ చెప్పారు.ఇక ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో ఈ కార్యక్రమంలో రాశి ఖన్నా, సాయి సుశాంత్, విక్రమ్ కె.కుమార్, దిల్ రాజు, బీవీఎస్ రవి, చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.
నాగచైతన్య నిత్యం వార్తల్లో హాట్ టాపిక్‌గానే ఉన్నాడు. సమంతతో విడాకులు తర్వాత నాగచైతన్య ఏం చేసిన వైరల్ అవుతోంది. నటి శోభితతో చైతు డేటింగ్ చేస్తున్నాడన్న వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక ఈ వార్తలపై స్పందించిన శోభిత... అలాంటిదేం లేదని కొట్టి పారేసింది. చైతుతో తనకు పెద్దగా పరిచయమే లేదని పేర్కొంది.