మనం సినిమా తర్వాత విక్రమ్- చైతన్య కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో 'థ్యాంక్ యూ'పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ పతాకం పై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నాగ చైతన్య మూడు భిన్నమైన లుక్స్‌తో కనిపించనున్నాడు.ఈ సినిమాను విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
2017లో చైసామ్ వివాహం ఘనంగా జరిగింది. విడాకులు తీసుకున్న తర్వాత కూడా వీరు ఎక్కడా కూడా ఒకరిపై ఒకరు ఎలాంటి విమర్శలు కాని... ఆరోపణలు చేసుకోలేదు. దాదాపు దశాబ్దానికి పైగా పరిచయం వీళ్ళిద్దరిది. నాలుగేళ్లపాటు దంపతులుగా కాపురం చేశారు. ఏమైందో తెలియదు కానీ ఊహించని విధంగా వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో ఈ జంట వివాహ బంధానికి బ్రేకప్ చెప్పేశారు.