అక్కినేని నాగ చైతన్య హీరోగా దిల్‌రాజు ప్రొడక్షన్ అసోసియేషన్ విత్ ఆదిత్య మ్యూజిక్ కాంబినేషన్‌తో శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ‘థాంక్యూ’. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. జూలై 22న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర యూనిట్ వైజాగ్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో నాగ చైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అక్కినేని నాగ చైతన్య మాట్లాడుతూ ‘‘వైజాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రావటానికి ప్రేక్షకులే కారణం. వారికి థాంక్యూ చెప్పటానికి వచ్చాను. అభిమానులకు ఎంత థాంక్స్ చెప్పినా సరిపోదు. తాతగారు, నాన్నగారిని చూసి యాక్టర్ కావాలని ఇన్స్పైర్ అయ్యాను. కానీ నేను ఈవాళ సినిమాను ప్రేమించి చేశానంటే అభిమానులు, ప్రేక్షకులే కారణం.
అభిమానులకే అభిమానులు మా అక్కినేని అభిమానులు. మనం ఎక్కడ మొదలయ్యామో మరిచిపోతే చేరిన గమ్యానికి విలువ ఉండదని థాంక్యూ సినిమాలో డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ గురించి ఆలోచించినప్పుడు నాకు వైజాగ్ గుర్తుకు వస్తుంది. ఎక్కడో నా సక్సెస్ స్టోరి పెద్ద రీజన్ వైజాగ్. నేను వైజాగ్‌లో షూటింగ్ చేసిన ప్రతీ సినిమా. నాకు కమర్షియల్ సక్సెస్ ఇవ్వటంతో పాటు హీరోగా నెక్ట్స్ స్టెప్‌కి తీసుకెళ్లింది. కొన్ని సినిమాలను కథగా చెప్పొచ్చు. కానీ వాటిని థియేటర్లో చూసిన తర్వాతే ఆ మూమెంట్స్ ఫీల్ అయ్యాకే మనల్ని టచ్ చేస్తుంది.
మనం రోజు థాంక్యూ అనే పదాన్ని వాడుతుంటాం. కానీ అవసరం ఉన్న చోట వాడం. థాంక్యూ పదానికి అసలు అర్థాన్ని థాంక్యూ సినిమా నేర్పించింది. సినిమా చూసిన తర్వాత మీరు కూడా ఇన్స్పైర్ అవుతారు. థాంక్యూ చెప్పటానికి సిగ్గు పడకూడదు. థాంక్యూ సినిమాను చేసిన రాజుగారికి ముందు థాంక్స్ చెప్పాలి. ఆయనకు కథ నచ్చగానే విక్రమ్, పీసీగారు సహా పెద్ద టీమ్‌తో సపోర్ట్ చేశారు. నాకు బంగారంలాంటి సినిమా ఇచ్చారు. ఆయనకు ఎప్పటికీ థాంక్‌ఫుల్‌గా ఉంటాను.
మనం లాంటి సినిమా ఇచ్చిన డైరెక్టర్ విక్రమ్ .. అలాంటి గొప్ప సినిమామాను థాంక్యూ రూపంలో ఇవ్వబోతున్నాడు. రవి ఈ కథను ఇచ్చాడు. తను సత్యం సినిమా నుంచి నాకు తెలుసు. మజిలీ సినిమాను తమన్ ఏడు రోజుల్లో ఎలా చేశాడో నాకు తెలియదు. బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. తమన్ మజిలీ సినిమాకు మంచి సంగీతంతో పాటు మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. ఇప్పుడు అలాగే థాంక్యూ సినిమాకు ప్రాణం పెట్టి చేశాడు. ప్రతి పాట అద్భుతంగా ఉంది. ఆర్ఆర్ కూడా అలాగే ఉంది. తనకు కూడా థాంక్యూ.
పీసీగారికి వంద సార్లు థాంక్యూ చెప్పిన సరిపోదు. ఆయనతో కలిసి పనిచేయటం నా డ్రీమ్. ఈ సినిమాతో అది నేరవేరింది. అలాగే ఎడిటర్ నవీన్ , రాశీ ఖన్నా, మాళవిక, అవికా గోర్, ప్రకాష్ రాజ్‌గారు, తులసి గారు ఇలా చాలా మంచి యాక్టర్స్ మా సినిమాలో ఉన్నారు. జూలై 22న మీ ముందుకు రాబోతున్నాం’’ అన్నారు నాగ చైతన్య.