Naga Babu: మేధావుల్లారా ఏడవకండి.. నాగబాబు ఫైరింగ్ చూసి ఆర్జీవీ రియాక్షన్..!
Naga Babu: మేధావుల్లారా ఏడవకండి.. నాగబాబు ఫైరింగ్ చూసి ఆర్జీవీ రియాక్షన్..!
Ram Gopal Varma: ఎవరేమనుకుంటే నాకేంటి..? నా మనసులో ఉన్నది చెప్పేస్తా అనే ధోరణి మెగా బ్రదర్ నాగబాబుది. సినిమాలు, రాజకీయాల పరంగా ఎవ్వరు ఎలాంటి కామెంట్ చేసిన రియాక్ట్ అయ్యే కోణం రామ్ గోపాల్ వర్మది. తాజాగా సినిమాలపై నాగబాబు చేసిన కామెంట్స్ చూసి ఆర్జీవీ క్రేజీ రియాక్షన్ ఇచ్చారు.
ఎవరేమనుకుంటే నాకేంటి..? నా మనసులో ఉన్నది చెప్పేస్తా అనే ధోరణి మెగా బ్రదర్ నాగబాబుది. సినిమాలు, రాజకీయాల పరంగా ఎవ్వరు ఎలాంటి కామెంట్ చేసిన రియాక్ట్ అయ్యే కోణం రామ్ గోపాల్ వర్మది. తాజాగా సినిమాలపై నాగబాబు చేసిన కామెంట్స్ చూసి ఆర్జీవీ క్రేజీ రియాక్షన్ ఇచ్చారు.
2/ 9
సినిమాలు, సమాజంపై వాటి ప్రభావం అనే అంశంపై నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సినిమాను, సినిమా నిర్మాణాన్ని ఉద్దేశించి తాజాగా నాగబాబు చేసిన ట్వీట్స్ పలు చర్చలకు దారితీశాయి.
3/ 9
పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడిగా ఉన్న నాగబాబు సోషల్ మీడియాలో యాక్టీవ్ రోల్ పోషిస్తుంటారు. పార్టీకి సంబంధించిన అన్ని విషయాలతో పాటు మెగా ఫ్యామిలీ అప్డేట్స్ పంచుకుంటూ ఉంటారు.
4/ 9
ఇందులో భాగంగా సినిమా నిర్మణంపై నాగబాబు రియాక్ట్ అయ్యారు. సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ వ్యాపారం మాత్రమే అని తెలుపుతూ ట్వీట్ పెట్టారు. ఓ ఫిలింమేకర్ గా తన దృష్టిలో సినిమాలు అనేవి ఎంటర్టైన్మెంట్ కోసమేనని వెల్లడించారు నాగబాబు.
5/ 9
సినిమా వల్ల జనాలు చెడిపోతున్నారనే విషయాన్ని ఖండించారు మెగా బ్రదర్. జనాన్ని బాగుచేయడం కోసమో, చెడగొట్టడం కోసమో సినిమాలు చేసేంత గొప్పవాళ్లు ఎవ్వరూ లేరని, ఇది కేవలం బిజినెస్ మాత్రమే అని చెప్పారు నాగబాబు.
6/ 9
సినిమా ఇండస్ట్రీకి ఒక సెన్సార్ బోర్డు అనేది ఉందని చెప్పిన నాగ బాబు.. వివాదాస్పద విషయాలను సెన్సార్ బోర్డు ముందుగానే చూసుకుంటుంది అని చెప్పారు. అంతేకాదు సినిమాల వల్ల జనాలు చెడిపోతున్నారు అని ఏడ్చే కుహనా మేధావులకు ఇదే సమాధానం అని స్పష్టం చేశారు.
7/ 9
దీంతో మెగా బ్రదర్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ట్వీట్ చూసిన వివాదాస్పద దర్శకులు రామ్ గోపాల్ వర్మ.. అదే ట్వీట్ ని రీ ట్వీట్ చేస్తూ క్రేజీ రియాక్షన్ ఇచ్చారు. మీరు చెప్పింది అక్షరాలా నిజం అని ఆర్జీవీ అన్నారు.
8/ 9
అయితే నాగబాబు, ఆర్జీవీ పెట్టిన ఈ ట్వీట్స్ చూసి జనం మిశ్రమంగా స్పందిస్తున్నారు. సినిమా అనేది బిజినెస్ అనే కోణంలో చూసే పక్షంలో సినిమా అనేది కళామ తల్లి అని, మేము ఆమె ముద్దు బిడ్డలం వంటి డైలాగ్స్ కొట్టకండి అంటూ నెటిజన్లు సెటైర్స్ వేస్తుండటం గమనార్హం.
9/ 9
సినిమాల్లో నటిస్తూనే నిర్మాతగా కూడా పలు సినిమాలు రూపొందించారు నాగబాబు. ఆయన నిర్మాణంలో రుద్రవీణ, బావగారు బాగున్నారా, గుడుంబా శంకర్, ఆరెంజ్ లాంటి సినిమాలు వచ్చాయి.