Prabhas: ప్రభాస్ ప్రాజెక్ట్ Kపై నాగ్ అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్.. అందుకే లేట్ అంటూ!
Prabhas: ప్రభాస్ ప్రాజెక్ట్ Kపై నాగ్ అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్.. అందుకే లేట్ అంటూ!
Project K: ప్రభాస్ ప్రాజెక్ట్ Kపై ఫుల్ ఫోకస్ పెట్టారు నాగ్ అశ్విన్. పాన్ వరల్డ్ స్థాయిలో అంతర్జాతీయ స్టాండర్డ్స్ తో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తుండటం రెబల్ స్టార్ అభిమానులను హుషారెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై నాగ్ అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
మహానటి సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న నాగ్ అశ్విన్.. ఇప్పుడు ప్రభాస్ తో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్ట్ K అనే పేరుతో ఎంతో గ్రాండ్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
2/ 8
ఓ విజువల్ వండర్‌గా ఉండేలా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టారు నాగ్ అశ్విన్. పాన్ వరల్డ్ స్థాయిలో అంతర్జాతీయ స్టాండర్డ్స్ తో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తుండటం రెబల్ స్టార్ అభిమానులను హుషారెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై నాగ్ అశ్విన్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
3/ 8
ఇప్పటి వరకు సినిమాకి సంబంధించి ఎలాంటి అప్ డేట్ రాకపోవడంతో జనాల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఆ మధ్య నిర్మాత అశ్వినీదత్ మాట్లాడుతూ, సమ్మర్‌లోగానీ, దసరాకి గానీ సినిమాని విడుదల చేస్తామని అన్నారు. ప్రభాస్ అనారోగ్యం విషయంలో కాస్త ఆలస్యమవుతుందని తెలిపారు.
4/ 8
ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ఏంటని నాగ్ అశ్విన్ ని ప్రశ్నించగా ఆయన రియాక్ట్ అయిన తీరు షాకిచ్చింది. మహానటిలా కిరాయికి తేలేమని ఈ సినిమాకు సంబంధించి ప్రతిదీ తయారు చేసుకోవాలని, అందుకే టైమ్ పడుతుందని తెలిపారు నాగ్ అశ్విన్.
5/ 8
మహానటిలో కార్లు కావాలంటే వెళ్లి రెంట్‌కి తీసుకోవచ్చు. రోజు చొప్పున కిరాయికి తీసుకోవచ్చు. అదే `ప్రాజెక్ట్ K`కి వెహికిల్స్ కావాలంటే దొరకడం కష్టం. వాటిని మేమే ప్రత్యేకంగా తయారు చేసుకోవాలి కాబట్టి టైమ్ పడుతుందని నాగ్ అశ్విన్ అన్నారు.
6/ 8
దీంతో ప్రభాస్ ప్రాజెక్టు K పూర్తి కావడం ఇప్పట్లో అయ్యే పని కాదని, ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యమవుతుందని క్లియర్ గా అర్థమవుతోంది. భారీ సినిమా కాబట్టి వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ అయితే కష్టమే అని తెలుస్తోంది.
7/ 8
భారీ రేంజ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతున్న ప్రభాస్.. ప్రస్తుతం ఈ సినిమా కోసం కొన్ని డేట్స్ ఇచ్చారు. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ K సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది.
8/ 8
దీంతో పాటు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్, ప్రశాంత్ నీల్ దర్శాకత్వంలో సలార్ సినిమాలు చేస్తున్నారు ప్రభాస్. ఈ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్ తో రూపొందుతున్నాయి. ఇవి పూర్తికాగానే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ మూవీ సెట్స్ మీదకు రానుంది.