Nabha Natesh hot photos: ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కెరీర్లో కావాల్సినంత పెద్ద బ్రేక్ అందుకుంది నభా నటేష్. దానికి ముందు చేసిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమా ఫ్లాప్ కావడంతో అందం ఉన్నా కూడా ఎందుకో అమ్మాయికి క్రేజ్ రాలేదు. కానీ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ సంపాదించుకుంది. (Instagram/Photo)
ఈ చిత్రం తర్వాత వరుసగా ఈమె కోసం కుర్ర హీరోలు క్యూ కడుతున్నారు.. నిర్మాతలు కూడా నభా డేట్స్ కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే రవితేజ, వరుణ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్ సహా చాలా మంది హీరోలతో జోడీ కట్టింది నభా నటేష్. త్వరలోనే మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి హీరోల సరసన నటించాలని ఉందని పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూనే ఉంటోంది. (Instagram/Photo)
గతేడాది మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా వచ్చిన ‘మాస్ట్రో’ సినిమాలో హీరోయిన్గా నటించింది నభా నటేష్. తాజాగా ఈమె సూపర్ హాట్ అవతారంలోకి మారిపోయింది. వరుణ్ తేజ్ ‘గని’ సినిమాలోనూ హీరోయిన్గా నటిస్తుంది నభా. ఈ సినిమాపై నభా నటేష్ భారీ ఆశలే పెట్టుకుంది. ఈ సినిమాను కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తున్నారు. అల్లు అరవింద్ తనయుడు బాబీ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. (Instagram/Photo)
అవకాశాలు వస్తున్నపుడే అందాలను కూడా విరివిగా చూపించేస్తుంది ఈ భామ. దాంతో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండేలా ప్లాన్ చేసుకుంటుంది నభా నటేష్.ఎప్పటి కపుడు కొత్త కొత్త ఫ్యాషన్ వేర్స్ ధరిస్తూ.. వాటికి సంబంధించిన ఫోటోలను నభా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ ఉంటోంది నభా. ఈ ఫోటోలు చూసిన తర్వాత బాపురే ఏం భామరే అనుకోకుండా ఉండటం కష్టమే. (Instagram/Photo)
చేతినిండా సినిమాలు ఉన్నపుడే గ్లామర్ షో చేయాలనే ఉద్దేశ్యంతో ముందుకు వెళ్తుంది నభా నటేష్. అందులో భాగంగానే కొత్త కొత్త పోజులతో పిచ్చెక్కిస్తుంది ఈ బ్యూటీ. మాస్ అందాల ఆరబోతతో ఇస్మార్ట్ శంకర్‌లో అరుపులు పెట్టించిన నభా నటేష్.. ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తుంది. అంతేకాదు టాలీవుడ్లో ఉన్న కుర్ర హీరోలకు ఫస్ట్ ఆప్షన్లా మారింది. (Instagram/Photo)