క్రిష్ హరిహర వీరమల్లు, భీమ్లా నాయక్ సినిమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నాడు పవన్. అవి పూర్తైన తర్వాత హరీష్ సినిమా మొదలు కానుంది. గబ్బర్ సింగ్ వచ్చి 9 ఏళ్లు పూర్తి చేసుకున్నా కూడా ఇప్పటికీ అదే బ్రాండ్‌తో ముందుకెళ్తున్నాడు హరీష్ శంకర్. కచ్చితంగా ఈ సారి కూడా బ్లాక్‌బస్టర్ కొడతామని ధీమాగా చెప్పాడు ఈ దర్శకుడు.
గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత పవన్ కోసమే కథ సిద్ధం చేస్తున్నాడు హరీష్ శంకర్. ఈ మధ్యే పవన్ పుట్టిన రోజు సందర్భంగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలతో వచ్చి ఆయనను కలిసాడు దర్శకుడు హరీష్ శంకర్. ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి కాసేపు ముచ్చటించాడు. సినిమాకు సంబంధించిన విషయాలను కూడా పంచుకున్నారు. అందులోనే రెగ్యులర్ షూటింగ్ ముచ్చట్లు కూడా వచ్చాయి.
పవన్, హరీష్ శంకర్ సినిమాకు క్రేజీ టైటిల్ అనుకుంటున్నారు. ‘ఇప్పుడే మొదలైంది’ అంటూ చిత్రమైన టైటిల్ దీనికి పెడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ సీన్లో అప్పుడే అయిపోయిందనుకోకు.. ఇప్పుడే మొదలైంది అంటూ విలన్‌కు వార్నింగ్ ఇస్తాడు పవన్ కళ్యాణ్. ఇదిలా ఉంటే మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ సెప్టెంబర్ 9 ఉదయం 9.45 నిమిషాలకు అనౌన్స్ చేయబోతున్నారు.
ఆ మధ్య గబ్బర్ సింగ్ 9 ఏళ్ళు పూర్తైనపుడు హరీష్ శంకర్ రాసిన లెటర్లో కూడా ‘ఇప్పుడే మొదలైంది’ అనేది హైలైట్ చేసాడు. దాన్ని బట్టి పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమాకు టైటిల్ కూడా ఇదే అంటూ సోషల్ మీడియాలో వార్తలు బాగానే వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో కేవలం ఎంటర్టైన్మెంట్ కాకుండా రాజకీయం కూడా ఉండబోతుందని తెలుస్తుంది.
పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ సినిమా అక్టోబర్ నుంచి మొదలు కానుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం నెలకు 10 రోజులు డేట్స్ ఇవ్వాలని చూస్తున్నాడు పవర్ స్టార్. హరీష్‌తో పాటు మిగిలిన దర్శకులు కూడా లైన్లో ఉండటంతో నెలకు 10 రోజులు కేటాయించబోతున్నాడు పవర్ స్టార్. ఇందులో తండ్రి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా.. కొడుకు సామాజిక కార్యకర్తగా నటించనున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి పవన్, హరీష్ సినిమాపై మైత్రి మూవీ మేకర్స్ ఇచ్చే అప్డేట్ ఏంటో మరి..?