Akkineni Nagarjuna: టాలీవుడ్ స్టార్ హీరో.. అక్కినేని నట వారసుడు నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా సినిమాలలో నటిస్తున్నాడు నాగార్జున. ఈయన కుటుంబం మొత్తం సినీ ఇండస్ట్రీకి పరిచయమైన వాళ్లే. ఇక తన తండ్రి నాగేశ్వరరావు మాటలను ఎప్పుడు జవదాటలేదట నాగార్జున. అలానే నాగార్జునకు మొదటి పెళ్లి విడాకులతో ముగియగా ఆ తర్వాత సినీ హీరోయిన్ అమలను ప్రేమించి రెండో పెళ్లి చేసుకున్నాడు.ఇక నాగేశ్వరరావు నాగార్జున పెళ్లికి ముందే ప్రేమ పెళ్లి వద్దని చెప్పినా కూడా వినకుండా పెళ్లి చేసుకున్నాడట. తన మాట వినకుండా పెళ్లి చేసుకున్నందుకు.. నాగార్జునకు నాగేశ్వర్ రావుకి మాటలు కట్ అయ్యాయట. అయితే సినీ నటుడు మురళీ మోహన్ నాగేశ్వర్ రావుతో 'కొడుకుని దూరం చేసుకోవద్దు'' అంటూ చెప్పారట. దీంతో కోడల్ని, కొడుకుని దగ్గరికి తీసుకున్నాడట నాగేశ్వరావు.