2020 తొలి ఆర్నెళ్లలో మరణించిన సినీ ప్రముఖులు వీళ్లే..
2020 తొలి ఆర్నెళ్లలో మరణించిన సినీ ప్రముఖులు వీళ్లే..
2020 వీలైనంత త్వరగా నువ్వు వెళ్లిపో.. ఆర్నెళ్లు అయిపోయింది కదా.. మిగిలిన 6 నెలలు కూడా త్వరగా అయిపో.. ఓ సగటు సినీ ప్రేక్షకుడి ఆవేదన ఇదే ఇప్పుడు. 2020 ఏ ముహూర్తంలో మొదలైందో కానీ ఈ ఏడాది మాత్రం సినిమా వాళ్లు చాలా మంది చనిపోయారు. బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. 2020లో ఇప్పటికే దాదాపు 25 మంది సెలబ్రిటీస్ మరణించారు.
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్: కేవలం 34 ఏళ్ల వయసులోనే ఈయన తన జీవితాన్ని ముగించేసాడు. ఆత్మహత్య చేసుకుని అందరికీ దూరం అయిపోయాడు. సుశాంత్ మరణం బాలీవుడ్ సినిమాకు తీరనిలోటే.
2/ 27
చిరంజీవి సర్జ: 2020లో మరో పెను విషాదం చిరంజీవి సర్జ మరణం. కన్నడనాట స్టార్ హీరోగా వెలిగిపోతున్న ఈయన కేవలం 39 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యాడు. ఈయన మరణాన్ని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు.
3/ 27
బాలమిత్రన్: తొలి సినిమా విడుదల కాకుండానే తమిళ యువ దర్శకుడు బాలమిత్రన్ బ్రెయిన్ స్ట్రోక్‌తో కన్నుమూసాడు.
4/ 27
జగేష్ ముకాటి: ప్రముఖ బాలీవుడ్ టెలివిజన్ నటుడు జగేష్ ముకాటి కేవలం 49 ఏళ్ల వయసులోనే అనారోగ్యంతో చనిపోయాడు.
5/ 27
అరుణ్ ప్రశస్త్: శంకర్ అసిస్టెంట్ డైరెక్టర్ అరుణ్ ప్రశస్త్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. ఈయన తొలి సినిమా ఇంకా విడుదల కాలేదు.
6/ 27
కన్నన్: భారతీరాజాతో ఎన్నో అద్భుతమైన సినిమాలకు పని చేసిన లెజెండరీ సినిమాటోగ్రఫర్ కన్నన్ అనారోగ్యంతో 2020లోనే కన్నుమూసారు.
7/ 27
సేతురామన్: తమిళనాట ఇప్పుడిప్పుడే నటుడిగా అడుగులు వేస్తున్న డాక్టర్ సేతురామన్ గుండెపోటుతో 36 ఏళ్ళ వయసులోనే చనిపోయాడు.
8/ 27
జిబిత్ జార్జ్: మలయాళ దర్శకుడు జిబిత్ జార్జ్ తొలి సినిమా విడుదలైన కొన్ని రోజులకే గుండెపోటుతో కన్నుమూసాడు.
9/ 27
మెబీనా మైఖెల్: కన్నడ నటి, మోడల్ మెబీనా మైఖెల్ 2020లోనే రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది.
10/ 27
1. ఇర్ఫాన్ ఖాన్: బాలీవుడ్ స్టార్ కారెక్టర్ ఆర్టిస్టుగానే కాకుండా హీరోగా కూడా క్రేజ్ తెచ్చుకున్న ఇర్ఫాన్ ఖాన్ ఎప్రిల్ 29న కన్నుమూసారు. ఈయన మరణం అందర్నీ కలిచివేసింది.
11/ 27
2. రిషి కపూర్: ఇర్ఫాన్ మరణం ఇంకా పచ్చిగా ఉండగానే 24 గంటల్లోపే బాలీవుడ్ లెజెండరీ నటుడు రిషి కపూర్ ఎప్రిల్ 30న మరణించారు. ఈయన కూడా కేన్సర్‌తోనే కన్నుమూసాడు.
12/ 27
3. బసు ఛటర్జీ: బాలీవుడ్లో రజినీగంథ, చోటీ సీ బాత్ వంటి పలు క్లాసిక్ చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన బసు ఛటర్జీ జూన్ 4న కన్నుమూసారు. ఆయన వయసు 93 ఏళ్లు.
13/ 27
4. వాజిద్ ఖాన్: బాలీవుడ్లో ఎన్నో సినిమాలకు అదిరిపోయే సంగీతం అందించిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్.. కేవలం 42 ఏళ్ల వయసులో కిడ్నీ సమస్యతో పాటు కరోనా వైరస్ కారణంగా జూన్ 1న కన్నుమూసాడు.
14/ 27
5. ప్రేక్షా మెహతా: బాలీవుడ్ సీరియల్స్‌తో ఫేమస్ అయిన ప్రేక్షా మెహతా.. మే 29న ఆత్మహత్య చేసుకుంది. ఈమె మరణానికి ఆర్థిక ఇబ్బందులే కారణం అని పోలీసులు ప్రాథమిక నిర్ధారణలో తేల్చారు.
15/ 27
6. యోగేష్ గౌర్: ప్రముఖ బాలీవుడ్ రచయిత యోగేష్ గౌర్ కూడా మే 29న కన్నుమూసారు.
16/ 27
7. సెజల్ శర్మ: ప్రముఖ బాలీవుడ్ సీరియల్ నటి సెజల్ శర్మ ఇదే ఏడాది ఆత్మహత్య చేసుకుంది. దిల్ తో హ్యాపీ జీ సీరియల్‌తో ఈమె గుర్తింపు తెచ్చుకుంది.
17/ 27
8. మోహిత్ భాగెల్: సల్మాన్ ఖాన్ లాంటి హీరోల సినిమాల్లో నటించి కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న మోహిత్ భాగెల్.. భయంకరమైన కాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ మే 23న కన్నుమూసారు. ఈయన వయసు కేవలం 27 ఏళ్లు మాత్రమే.
18/ 27
9. నిమ్మి: 50, 60 దశకాల్లో బాలీవుడ్లో ఎన్నో సినిమాల్లో నటించిన ప్రముఖ సీనియర్ నటి నిమ్మి 87 ఏళ్ల వయసులో ఈ లాక్డౌన్ సమయంలోనే మరణించారు.
19/ 27
10. మన్మీత్ గ్రేవాల్: టీవీ సీరియల్స్‌తో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మన్మీత్ గ్రేవాల్ మే 16న ఆత్మహత్య చేసుకున్నాడు. లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు రావడంతో ప్రాణాలు వదిలేసాడు మన్మీత్.
20/ 27
11. అభిజీత్: షారుక్ ఖాన్ రెడ్ చిల్లీస్ సంస్థలో అత్యంత కీలంగా ఉండే అభిజీత్ మే 15న కన్నుమూసారు. ఈయన మృతిపై షారుక్ సంతాపం వ్యక్తం చేసాడు.
21/ 27
12. సాయి గుండేవార్: అమీర్ ఖాన్ పీకే, రాక్ ఆన్ లాంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు సాయి గుండేవార్ మే 10న బ్రెయిన్ కాన్సర్‌తో బాధ పడుతూ యుఎస్‌లో మరణించాడు.
22/ 27
13. షఫీక్ అన్సారీ: క్రైమ్ పెట్రోల్ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైన నటుడు షఫీక్ అన్సారీ మే 10న అనారోగ్యంతో కన్నుమూసాడు. ఈయన వయసు 52 ఏళ్లు మాత్రమే.
23/ 27
14. అమోస్: అమీర్ ఖాన్ దగ్గర గత పాతికేళ్లుగా పని చేస్తున్న అసిస్టెంట్ అమోస్ మే 12న హార్ట్ ఎటాక్‌తో మరణించారు.
24/ 27
15. సచిన్ కుమార్: కహానీ ఘర్ ఘర్ కీ లాంటి సీరియల్‌తో అందరికీ గుర్తిండిపోయే పాత్ర చేసిన సచిన్ కుమార్ మే 15న గుండెపోటుతో కన్నుమూసాడు. కేవలం 25 ఏళ్ల వయసులోనే ఈయన చనిపోవడం విషాదకరం.
25/ 27
16. శ్రీలక్ష్మి కనకాల: రాజీవ్ కనకాల చెల్లెలు శ్రీలక్ష్మి కనకాల కూడా 2020లోనే కన్నుమూసింది. కరోనా కారణంగా ఈమె మరణించినా కూడా ఎవ్వరూ రావద్దని తెలిపారు రాజీవ్ కుటుంబ సభ్యులు.
26/ 27
17. బుల్లెట్ ప్రకాశ్: ప్రముఖ కన్నడ కమెడియన్ బుల్లెట్ ప్రకాశ్ కూడా లాక్డౌన్ సమయంలోనే చనిపోయాడు. 300 సినిమాలకు పైగా కన్నడ సినిమాల్లో కామెడీ పాత్రల్లో మెప్పించాడు ప్రకాశ్.
27/ 27
18. అబ్ధుల్లా: సల్మాన్ ఖాన్ మేనల్లుడు అబ్ధుల్లా కూడా ఇదే లాక్డౌన్ సమయంలో కన్నుమూసాడు. కేవలం 38 ఏళ్ల వయసులోనే ఈయన చనిపోయాడు.