బిగ్ బాస్ 5 తెలుగులో మరో ట్విస్ట్ వచ్చింది. నిన్నటి వరకు ఎలిమినేట్ అవుతాడని సోషల్ మీడియాలో వచ్చిన వార్తలన్నీ ఇప్పుడు అబద్ధమే అని తేలిపోయింది. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న వాళ్లు కాకుండా మరొకరు ఎలిమినేట్ అయిపోయారు. దాంతో కాజల్ బతికిపోయింది.. సేఫ్ అయిపోయి మరో వారం ఇంట్లో ఉండటానికి అర్హత సాధించినట్లు అయింది.
అసలు విషయం ఏంటంటే.. ఈ వారం మానస్, కాజల్, సన్నీ, సిరి, యాంకర్ రవి నామినేషన్స్‌లో ఉన్నారు. అందులో సన్నీ, సిరి, యాంకర్ రవి సేఫ్ జోన్లో ఉన్నారు. ఈ ముగ్గురికి ఓటింగ్ కూడా బాగానే వచ్చింది. సన్నీకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే పెరిగిపోయింది. అందుకే ఓటింగ్ కూడా బాగానే వచ్చింది. మరోవైపు యాంకర్ రవి ఎప్పట్లాగానే సేఫ్ అయిపోయాడు. ఈయనకు ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది.
ఇక సిరికి కూడా షణ్ముఖ్ జస్వంత్, జెస్సీ ఫాలోయర్స్ ఓట్లు వేసారు. దాంతో ఈ ముగ్గురు ముందుగానే సేఫ్ అయిపోయారు. అయితే డేంజర్ జోన్లో మాత్రం మానస్, కాజల్ ఉన్నారు. అందులో మానస్‌కు మంచి ఓట్లు పడ్డాయి. కాజల్ కచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ అవుతుందనే వార్తలు వచ్చాయి. పైగా ఇంట్లో ఆమె పర్ఫార్మెన్స్ కూడా గత కొన్ని వారాలుగా చాలా వీక్ అయిపోయింది.
ఇంటికి వచ్చిన మొదట్లో కాజల్ పేరు ఎక్కువగా వినిపించేది. కానీ ఈ మధ్య కాలంలో ఎక్కువగా సన్నీ, మానస్‌తోనే ఉంటూ పూర్తిగా అక్కడికే పరిమితం అయిపోయింది. అందుకే ఓటింగ్‌లో వాళ్ల కంటే వెనకబడింది కాజల్. ఇదిలా ఉంటే ఈ వారం కాజల్ బయటికి వచ్చేస్తుందని అంతా అనుకుంటున్న తరుణంలో.. చివరి నిమిషంలో ఈమె సేఫ్ అయిపోయింది.