Tollywood Medium Range Most Profitable Movies: ఈ యేడాది ‘బింబిసార’, కార్తికేయ 2, సీతా రామం, కార్తికేయ 2 సినిమాలు అత్యధిక లాభాలు తీసుకొచ్చిన మీడియం రేంజ్ సినిమాల్లో టాప్‌లో నిలిచాయి. తెలుగులో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాలు ఇవే.. ఏ సినిమానైనా.. అది అమ్ముడు పోయిన రేటు కంటే ఎక్కువగా వసూళ్లు సాధించిన సినిమాలనే హిట్స్‌గా పరిగణిస్తారు. అటు డబ్బింగ్ చిత్రాల్లో తక్కువ రేటుకు అమ్ముడు పోయిన ‘కాంతారా’ కొన్న బయ్యర్స్‌కు మంచి లాభాలను తీసుకొచ్చింది. ముఖ్యంగా లో టూ మీడియం రేంజ్ సినిమాల్లో ఎక్కువ లాభాలు తీసుకొచ్చిన సినిమాల విషయానికొస్తే.. (Twitter/Photo)
1.గీత గోవిందం: | విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ గా మారడంలో అల్లు అర్జున్ పాత్ర చాలా ఉంది. అర్జున్ రెడ్డి కథను రిజెక్ట్ చేసి విజయ్ దేవరకొండకు లైఫ్ ఇచ్చిన అల్లు అర్జున్.. ఆ తర్వాత గీత గోవిందం కథ కూడా కాదు అనుకున్నాడు. సినిమాలో హీరోయిన్ డామినేషన్ ఉండడంతో అల్లు అర్జున్ స్టార్ ఇమేజ్ ఈ కథకు అడ్డు వచ్చింది. అందుకే కూడా చేయలేకపోయాడు బన్నీ. ఇదే సినిమా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కించి సంచలన విజయం అందుకొన్నాడు దర్శకుడు పరశురామ్. రూ. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రూ. 70 కోట్ల షేర్‌తో పాటు రూ. 55.43 కోట్ల లాభాలాను తీసుకొచ్చింది.
2.. కార్తికేయ 2 | ఎనర్జిటిక్ యంగ్ హీరో నిఖిల్, చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయకి సీక్వెల్‌గా వచ్చిన కార్తికేయ 2 తెలుగు సహా హిందీలో సంచలన విజయం సాధించింది. దేశమంతా ఈ చిత్ర సంచలనాలు కొనసాగుతున్నాయి. ఈ సినిమా ఓవరాల్‌గా ఇప్పటి వరకు రూ. 36.55కోట్ల షేర్ లాభాలను తీసుకొచ్చింది. అంతేకాదు ఎక్కువ లాభాలను తీసుకొచ్చిన చిత్రాల్లో టాప్ 10లో నిలిచింది. ఈ సినిమా రూ. 12.8 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటి వరకు రూ. 58.40 కోట్ల షేర్ (రూ. 121.50 కోట్ల గ్రాస్ ) వసూళ్లను సాధించింది. ఓవరాల్‌గా రూ. 45.10 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. (Karthikeya2 Twitter)
3.ఉప్పెన : సాయి ధరమ్ తేజ్ తమ్ముడు, మెగాస్టార్ మేనల్లుడుగా వచ్చిన వైష్ణవ్.. తొలి సినిమా ఉప్పెనతో సంచలనం రేపాడు. కృతి శెట్టి హీరోయిన్గా నటించిన చిత్రం రూ. 51 కోట్ల షేర్ వసూలు చేసింది. మొత్తంగా తొలి సినిమాతో ఈ మూవీ సంచలనం రేపింది. ఈ మూవీ రూ. 20.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తే .. రూ. 31.02 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. ఈ యేడాది నిర్మాతగా అత్యధిక లాభాలు తీసుకొచ్చిన రెండో చిత్రంగా నిలిచింది. ఓ రకంగా చెప్పాలంటే పెట్టిన పెట్టుబడికి వచ్చిన లాభాలు చూసుకుంటే.. మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీగా నిలిచింది.
5.సీతా రామం | దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ టైటిల్ రోల్లో నటించిన మూవీ ‘సీతారామం’. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమా రూ. 16.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఓవరాల్‌గా ఈ సినిమా దాదాపు రూ. 46.50 కోట్ల షేర్ (రూ. 98.10 కోట్ల గ్రాస్) రాబట్టింది. ఈ సినిమా రూ. 29.50 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. (Twitter/Photo)