Most Eligible Bachelor Success Party : అఖిల్ అక్కినేని (Akhil Akkineni) బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (Akhil Akkineni Most Eligible Bachelor) అనే సినిమాను చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో అడ్డంకులు, వాయిదాల తర్వాత ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలై సూపర్ హిట్ అందుకుంది. హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆరేళ్ల తర్వాత అఖిల్ హీరోగా తొలి సక్సెస్ అందుకోవడంతో పాటు ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో అక్కినేని నాగార్జున.. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ టీమ్‌తో పాటు టాలీవుడ్ బడా దర్శకులకు పెద్ద పార్టీ ఇచ్చారు. (Twitter/Photo)
అక్కినేని ఫ్యామిలీకి 2021 బాగానే కలిసొచ్చింది. అక్కనేని నాగా చైతన్య.. ‘లవ్ స్టోరీ’మూవీతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నారు. మరోవైపు అఖిల్ కూడా హీరోగా సక్సెస్ రుచి ఏంటో చూసారు. ఈ సందర్భంగా నాగార్జున ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ సందర్భంగా చిత్ర పరిశ్రమలోని దర్శకులకు, నిర్మాతలకు పెద్ద పార్టీ ఇచ్చారు. (Twitter/Photo)
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ వీక్ పూర్తీ చేసుకుని.. ప్రాఫిట్ జోన్లో ఎంటర్ అయ్యింది. బాక్స్ ఆఫీస్ 8 వ రోజు రూ. 19 లక్షల రేంజ్ షేర్ నే సాధించింది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 36 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకున్నట్లు అయ్యింది. మొత్తంగా ఈ సినిమాతో అక్కినేని ఫ్యామిలీ నిజంగా దసరా, దీపావళి పండగ చేసుకుంటున్నారు. (Twitter/Photo)