Rhea Chakraborty: ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్స్ ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలో టాలీవుడ్, బాలీవుడ్ లో పలువురు హీరోయిన్స్ ముందుండగా బాలీవుడ్ నటి రియా చక్రవర్తి కూడా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా నిలిచింది. గత ఏడాది సుశాంత్ సింగ్ మరణం తర్వాత నుండి రియా చక్రవర్తి పేరు హాట్ టాపిక్ గా మారింది. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న రియా చక్రవర్తి కొన్ని రోజులు పాటు పోలీసుల అదుపులో కూడా ఉంది. ఇప్పటికి కూడా ఆమె పేరు హాట్ టాపిక్ గా ఉండగా ఈ సమయంలో మోస్ట్ డిజైరబుల్ లిస్టులో చేరింది.