ఎన్నో రోజులుగా వేచి చూస్తున్న డేట్ వచ్చేసింది. కెజియఫ్ 2 సినిమా విడుదల తేదీ కన్ఫర్మ్ అయిపోయింది. ఒకటి రెండు కాదు.. ఐదు భాషల్లో ఈ సినిమా ఒకేరోజు విడుదల కాబోతుంది. నిజంగా వాళ్లు సినిమా ఈ స్థాయి విజయం సాధిస్తుందని అనుకోలేదేమో..? ఎందుకంటే తొలిభాగం సృష్టించిన సంచలనాలు చూస్తుంటే ఆశ్చర్యపోవడం తప్ప ఇంకేం లేదు.
ఈ సినిమా 230 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇలాంటి సమయంలో కెజియఫ్ చాప్టర్ 2 కోసమని అన్ని ఇండస్ట్రీల నుంచి భారీ పోటీ ఉంది. దాంతో బిజినెస్ విషయంలో ఈ చిత్ర యూనిట్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. చాప్టర్ 1 సృష్టించిన సంచలనాలు చూసి చాప్టర్ 2 కోసం మూడింతలు రెట్లు ఎక్కువగా ఇస్తామంటూ వస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు.
తెలుగులో కెజియఫ్ తొలిభాగాన్ని 4 కోట్లకు తీసుకుంటే 13 కోట్ల షేర్ తీసుకొచ్చింది. తమిళనాట కూడా 10 కోట్ల వరకు వసూలు చేసింది. ఇక హిందీలో 40 కోట్ల వరకు రాబట్టింది. దాంతో రెండో భాగానికి భారీ ఆఫర్స్ వస్తున్నా కానీ నిర్మాతలు మాత్రం అస్సలు టెంప్ట్ కావడం లేదు. బంగారు గనుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది.
ఇప్పటికే విడుదలైన టీజర్ కూడా సంచలనాలు సృష్టించింది. నిజానికి ఈ సినిమాను 2020 అక్టోబర్ 23న విడుదల చేయాలనుకున్నా.. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత 2021, జులై 16న విడుదల తేదీ ఖరారు చేసారు. కానీ మరోసారి కరోనాకు ఈ డేట్ కూడా బలైపోయింది. దాంతో ఇప్పుడు ఎప్రిల్ 14, 2022కి కెజియఫ్ 2ను ఫిక్స్ చేసారు.
ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మళయాలంలో కెజియఫ్ 2 ఒకే రోజు విడుదలవుతుంది. ఈ చిత్ర క్లైమాక్స్ సన్నివేశాలు హైదరాబాద్లోనే పూర్తి చేసాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. ఆర్ఎఫ్సీలో ప్రత్యేకంగా ఈ చిత్రం కోసమే సెట్ నిర్మించారు. అందులోనే విలన్ సంజయ్ దత్, హీరో యష్ మధ్య యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించాడు దర్శకుడు.
ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం బాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రఫర్స్ పని చేసారు. తెలుగులో కెజియఫ్ 2 రైట్స్ దాదాపు 60 కోట్ల వరకు పలికినట్లు తెలుస్తుంది. ఏదేమైనా కూడా ఎప్రిల్ 14, 2022న కెజియఫ్ 2 వస్తే మాత్రం కచ్చితంగా మిగిలిన సినిమాలు సైడ్ ఇవ్వక మానదు. అదే రోజు ప్రభాస్ సలార్ కూడా వస్తుందని ప్రశాంత్ నీల్ అప్పట్లో ప్రకటించాడు. ఇప్పుడు కెజియఫ్ 2 కోసం దాన్ని పక్కకు జరపక తప్పదు.