ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మంత్రుల మాటలు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అక్కడ సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది. ముఖ్యంగా థియేటర్స్ స్వచ్ఛందంగా మూసుకుంటున్నారంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. వరసగా సినిమాలు విడుదల అవుతున్నాయి.. అందులోనూ మంచి విజయం అందుకుంటున్నాయి.. కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. కానీ ప్రయోజనం మాత్రం లేదు.
రాష్ట్రంలో టికెట్ రేట్లు మరీ తక్కువగా ఉండటంతో.. హౌజ్ ఫుల్స్ అయినా కూడా ఏం మిగలడం లేదని బాధ పడుతున్నారు థియేటర్ యాజమాన్యం. ముఖ్యంగా జగన్ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలతో వందల సంఖ్యలో థియేటర్లు మూత బడుతున్నాయి. ఇప్పటికే 200 థియేటర్స్ వరకు మూసేసారు. గత వారం రోజులుగా ఏపీలో థియేటర్స్ మరింత వేగంగా మూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా దాదాపు 100 థియేటర్స్ వరకు సీజ్ చేసారు.
ఈ దాడుల నేపథ్యంలో తమకు తాముగా థియేటర్స్ క్లోజ్ చేస్తున్నారు యాజమాన్యం. ఇదిలా ఉంటే అన్ని సినిమాల పరిస్థితి ఎలా ఉన్నా.. 400 కోట్లతో వస్తున్న ట్రిపుల్ ఆర్ విషయంలో ఏపీ సర్కార్ దయ తలుస్తుందని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేం లేదని.. అన్ని సినిమాలతో పాటే మీది కూడా 5 రూపాయలకు చూపించుకోండి అంటూ ఆదేశాలు జారీ చేసింది ఏపీ సర్కార్.
ట్రిపుల్ ఆర్ సినిమాకు మినహాయింపులు ఏం ఉండవని తేల్చి చెప్పింది. అంతేకాదు.. ఈ సినిమాకు ఎలాంటి అదనపు సడలింపులు, మినహాయింపులు కూడా ఉండవని తేల్చి చెప్పాడు ఏపీ మంత్రి పేర్ని నాని. నిబంధనలు పాటించని థియేటర్లను ఏపీలో మూసివేస్తున్నారని పేర్కొన్నారు. ట్రిపుల్ ఆర్ నిర్మాత దానయ్య ఇప్పటికే తమకు ఫోన్ చేసారని.. ఆయన తనతో చెప్పిన విషయాలను కమిటీ ముందు ఉంచుతానని మంత్రి పేర్ని నాని తెలిపారు.
మరోవైపు చిరంజీవి, జగన్ గురించి తనకు తెలియదని చెప్పాడు నాని. ప్రభుత్వం అనేది అందరికీ ఒకేలా ఉంటుందని.. మనిషిని బట్టి మారదని, నిబంధనలు అందరికీ ఒకటేనని చెప్పాడు నాని. జగన్ సర్కార్ అలాంటి విషయంలో నిష్పక్షపాతంగానే ఉంటుందని చెప్పాడు ఈయన. గత ప్రభుత్వం బాలయ్య సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చి.. చిరంజీవిని పట్టించుకోలేదని తెలిపాడు.
చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ఆంధ్రా వార్తలు, ఏపీ వార్తలు, తెలుగు వార్తలు, తెలుగు బ్రేకింగ్ న్యూస్," width="1600" height="1600" class="size-full wp-image-1094078" /> సినిమా సినిమాకు నిబంధనలు మారవని పేర్ని నాని చెప్పుకొచ్చారు. ఈ లెక్కన ఏపీ ప్రభుత్వం ట్రిపుల్ ఆర్ సినిమాకు ఊహించని షాక్ ఇచ్చిందనే చెప్పాలి. సినిమాను వందల కోట్లకు కొన్న డిస్ట్రిబ్యూటర్లకు ఈ షాకుల మీద షాకులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరోవైపు ఇది చాలదన్నట్లు ఢిల్లీ, ముంబైలో థియేటర్లను 50 శాతం ఆక్యుపెన్సీకి కుదిస్తూ మూసివేస్తూ ఆంక్షలు వెలువడ్డాయి.