Mohanlal: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సౌత్‌లో ఉన్న బడా సూపర్ స్టార్స్ ఎవరు తీసుకొని అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో అభిమానులతో పాటు మిగతా సినీ ఇండస్ట్రీ జనాలతో పాటు సామాన్య ప్రేక్షకులు కూడా బడా స్టార్ హీరో మోహన్‌లాల్ తీసుకున్న కూడా అవాక్కువుతున్నారు. వివరాల్లోకి వెళితే.. (Twitter/Photo)
రీసెంట్గా మోహన్‌లాల్ హీరోగా ‘దృశ్యం 2’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాను చూసి క్రిటిక్స్‌తో పాటు మిగతా భాషల దర్శకులు రాజమౌళి సహా చాలా మంది ఈ సినిమాను చూసి మెచ్చుకున్నారు. కోవిడ్ కారణంగా ఈ సినిమాను థియేటర్స్‌లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేసారు. సూపర్ స్టార్ అయిన మోహన్‌లాల్ నటించి సినిమా డైరెక్ట్‌గా ఓటీటీ వేదికగా విడుదల చేయడం మలయాళ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. (Twitter/Photo)
ఇక మోహన్‌లాల్ బాటలో ఆ తర్వాత మలయాళ హీరోలు నటించిన సినిమాలు కూడా డైెరెక్ట్‌గా విడుదలయ్యాయి. అటు తమిళంలో సూర్య నటించిన ‘ఆకాశం నీ హధ్దురా’, రీసెంట్గా ‘జై భీమ్’ సినిమాలు నేరుగా ఓటీటీ వేదికగా విడుదలయ్యాాయి. అటు వెంకటేష్ కూడా చేసిన ‘నారప్ప’ కూడా ఓటీటీ వేదికగా విడుదలైంది. అటు నాని నటించిన ‘వీ’ రీసెంట్గా ‘టక్ జగదీష్’ సినిమాలు కూడా నేరుగా ఓటీటీ వేదికగా విడుదల చేయడంపై కొంత మంది థియేటర్స్ ఓనర్లు, ఎగ్జిబిటర్లు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)
తాజాగా మోహన్‌లాల్‌తో ‘దృశ్యం 2’ సినిమాను నిర్మించిన ఆంటోని పెరుంబావూర్ మోహన్‌లాల్‌తో వరుసగా ఐదు చిత్రాలు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలన్నింటినీ ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించడం మలయాళ ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. ఈ యేడాది ఓటీటీ వేదికగా విడుదలైన ‘దృశ్యం 2’ సినిమాతో నిర్మాతకు మంచి లాభాలే వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈయన ఈ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. (Twitter/Photo)
ఇక మోహన్‌లాల్ హీరోగా ప్రియదర్శన్ హీరోగా నటించిన ‘మరక్కార్’ సినిమాతో పాటు ‘అరబిక్కడలిండే సింహం’ అనే చారిత్రక సినిమాలను థియేటర్స్‌లో విడుదల చేయాలనుకున్నారు. కరోనా కారణంగా రెండు మూడు సార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే కదా. చివరకు ఈ సినిమాలను ఓటీటీ వేదికగా విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. నిర్మాతల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మోహన్‌లాల్ ఈ నిర్ణయానికి ఓకే చెప్పినట్టు సమాచారం. (Twitter/Photo)
మోహన్‌లాల్ నటించిన ఈ సినిమాలను డైరెక్ట్ ఓటీటీ విడుదల చేస్తే ఒక్కో సినిమాకు రూ. 100 కోట్ల ఆఫర్ ప్రకటించినట్టు సమాచారం. అంటే ఐదు సినిమాలకు కలిపి మొత్తంగా రూ. 500 కోట్ల డీల్ అన్నమాట. త్వరలో ఆయా సినిమాలకు సంబంధించిన స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ప్రస్తుతం మోహన్‌లాల్ హీరోగా పృథ్వీ రాజ్ సుకుమారన్ డైరెక్షన్లో చేస్తోనన్ ‘బ్రో డాడీ’, జీతూ జోసేఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘12Th మేన్’ అటు షాజీ కైలాస్ డైరెక్షన్లో చేస్తోన్న ‘ఎలోన్’ మూవీ కూడా నేరుగా ఓటీటీ వేదికగా చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. (Twitter/Photo)