భారతదేశం గర్వించదగ్గ నటుల్లో మోహన్ లాల్‌కు సెపరేట్ ప్లేస్ వుంది. ఒక వైపు ఆయన సొంత భాషలో కమర్షియల్ సినిమాల్లో యాక్ట్ చేస్తూనే...మరోవైపు కళాత్మక సినిమాలతో ఆయనలో ఉన్న నటున్ని ఎలివేట్ చేసుకుంటూ జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా ఎదిగారు. అంతేకాదు ఈయన నటించిన పలు సినిమాలను తెలుగులో సీనియర్ అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్ వంటి హీరోలు తెలుగులో రీమేక్ చేసారు.
ఒక భాషలో హిట్టైన సినిమాను వేరే భాషల్లో రీమేక్ చేయడం ఎప్పటి నుంచో ఉంది. చిరంజీవి డైరెక్ట్ సినిమాలతో పాటు ఎన్నో రీమేక్ సినిమాల్లో నటించారు. ఈ రీమేక్ సినిమాలు కూడా చిరు కెరీర్లో బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. తమలయాళంలో మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘లూసీఫర్’ సినిమాను తెలుగులో రీమేక్ చేసారు. (Twitter/Photo)
నందమూరి నట సింహం బాలకృష్ణ కూడా మోహన్‌లాల్ హీరోగా నటించిన ‘ఆర్యన్’ సినిమాను తెలుగులో ‘అశోక చక్రవర్తి’ టైటిల్‌తో రీమేక్ చేసారు. ఈ సినిమా అనుకున్నంత రేంజ్లో మెప్పించలేకపోయింది. మొత్తంగా మలయాళ సూపర్ హిట్ ‘ఆర్యన్’ మూవీ అఫీషియల్ రీమేక్ చేసిన సినిమా మాత్రం ‘అశోక చక్రవర్తి’ మూవీనే. ఈ సినిమాతో శరత్ సక్సేనా తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. (Twiter/Photo)
‘ధ్రువనక్షత్రం’ చిత్రం మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటించిన ‘ఆర్యన్’ చిత్రానికి రీమేక్. ఇదే కథతో బాలకృష్ణ హీరోగా ‘అశోక చక్రవర్తి’ సినిమా తెరకెక్కింది. బాలయ్య ‘అశోక చక్రవర్తి’ బాక్పాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిస్తే.. వెంకటేష్ ‘ధ్రువ నక్షత్రం’ సూపర్ హిట్టైయింది. ఇక బాలకృష్ణ అశోక చక్రవర్తి, వెంకటేష్ హీరోగా నటించిన ధ్రువ నక్షత్రం’ సినిమా ఒకే రోజు విడుదల కావడం విశేషం. ఐతే.. ధ్రువ నక్షత్రం’ సినిమాను ఆర్యన్ సినిమాను ప్రేరణ తీసుకొని తెరకెక్కించారు. బాలయ్య సినిమా అశోక చక్రవర్తి అఫీషియల్ రీమేక్. (Youtube/Credit)