Pawan Kalyan Vs Mohan Babu | పవన్ కళ్యాణ్, మోహన్ బాబుల గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. మోహన్ బాబు విషయానికొస్తే.. ఈయన నటుడు కాకముందు.. దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఆ తర్వాత దాసరి నారాయణ రావు దర్శకత్వంలో హీరోగా ’స్వర్గం నరకం’ మూవీతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా రాణించారు. ఆ తర్వాత మళ్లీ హీరోగా నిలదొక్కుకున్నారు. అటు పవన్ కళ్యాణ్ కూడా ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. (Twitter/Photo)
ఇక మోహన్ బాబు సినిమాల్లోకి రాకముందు తన పేరును భక్తవత్సలం నాయుడు పేరును మోహన్ బాబుగా మార్చుకున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన తొలి సినిమాలో కళ్యాణ్ బాబుగా పరిచయమయ్యారు. ఇక రెండో సినిమా నుంచి తన పేరు ముందు పవన్ చేర్చుకున్నారు. మరోవైపు కళ్యాణ్ బాబులోని బాబు తొలిగించి పవన్ కళ్యాణ్ అయ్యారు. ఆ పేరు మహత్యమో ఏమో కానీ.. అన్నయ్య చిరంజీవిలాగానే.. మాస్లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఏకంగా అభిమానులచే దేవుడుగా కొలిచే స్థాయికి చేరుకున్నారు.(Twitter/Photo)
1998లో పవన్ కళ్యాణ్, మోహన్ బాబు రెండు వారాల గ్యాప్‌లో బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. 1998లో భీమనేని శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘సుస్వాగతం’ మూవీతో పలకరించారు. ఈ సినిమా జనవరి 1న విడుదలై మంచి విజయం సాధించింది. అటు మోహన్ బాబు నటించిన ఓం సాయి ప్రకాష్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఖైదీ గారు’ మూవీ జనవరి 14న విడుదలైంది. (Twitter/Photo)
పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘సుస్వాగతం’ కూడా తమిళంలో విజయ్ హీరోగా యాక్ట్ చేసిన ‘‘లవ్ టుడే’’ కు జిరాక్స్ కాపీనే. ఈ చిత్రం పవన్ కళ్యాణ్ కెరీర్లో స్పెషల్‌గా నిలిచిపోయింది. ఈ సినిమా డైరెక్ట్‌గా పలు కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. అటు రెండు వారాల గ్యాప్‌తో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ సరైన ఫలితం అందుకోలేదు. ఈ రకంగా అప్పట్లోనే మోహన్ బాబుపై బాక్సాఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ పై చేయి సాధించారు. హీరోగా సుస్వాగతం పవన్ కళ్యాణ్‌కు మూడో సినిమా కావడం విశేషం. (Twitter/Photo)
మళ్లీ దాదాపు 24 యేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్, మోహన్ బాబు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడ్డారు. అది కూడా ఒక వారం గ్యాప్‌లో. అప్పట్లో రెండు వారాల గ్యాప్‌తో సుస్వాగతం, ఖైదీ గారు విడుదలైతే.. ఇపుడు ఫిబ్రవరి 18న విడుదలైన మోహన్ బాబు ‘సన్ ఆఫ్ ఇండియా’ కనీస ఓపెనింగ్స్ లేక నెగిటివ్ షేర్‌తో టాక్ ఆఫ్ ది టాలీవుడ్‌గా నిలిచింది. మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ .. ఫిబ్రవరి 25న విడుదలై.. ఆయన కెరీర్లోనే హైయ్యెస్ట్ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. పెట్టిన పెట్టుబడికి వచ్చిన వసూళ్లతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అబౌ యావరేజ్‌గా నిలిచింది. (Twitter/Photo)
మొత్తంగా మోహన్ బాబు వర్సెస్ పవన్ కళ్యాణ్ విషయానికొస్తే.. వీళ్లిద్దరు రెండు సార్లు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడితే.. రెండు సార్లు పవన్ చేతిలో మోహన్ బాబుకు పరాభవం తప్పలేదనే చెప్పాలి. ఇక వీళ్లిద్దరి ఇమేజ్ను మనం పోల్చలేము. కానీ ప్రస్తుతం చూస్తే.. హీరోగా మోహన్ బాబు మార్కెట్ పూర్తిగా పడిపోయిందనే చెప్పాలి. (Twitter/Photo)