విలక్షణ నటుడు మోహన్ బాబు తన 71 వ పుట్టిన రోజు సందర్భంగా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినిమాల కోసం ఆస్తుల్నీ అమ్మాల్సి వచ్చింది. పగవాడికి కూడా నాలాంటీ కష్టాలు రాకూడదు. ఏ ఒక్కరూ కూడా సాయం చేసేందుకు ముందుకు రాలేదని అన్నారు. అంతేకాదు సన్నాఫ్ ఇండియా, జిన్నా చిత్రాలు ఫెయిల్యూర్‌గా నిలిచాయని తెలిపారు. Photo : Twitter
ఇక ఈ సందర్భంగా మోహన్ బాబు తెలుగు సినీ వజ్రోత్సవ వేడుకల సమయంలో చిరంజీవితో చేసుకున్న సంఘటనపై అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. సోషల్ మీడియాలో చాలా వస్తుంటాయి. నిజాలేంటి, అసత్యాలేంటి.. ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు.. ఇప్పుడు అంతా హ్యాపీగా ఉన్నాం అన్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో అన్నదమ్ముల మధ్య, స్నేహితుల మధ్య, ఆత్మీయుల మధ్య బేధాలు వస్తుంటాయి. భారత, రామాయణం చూసాం అంటూ క్లారిటీ ఇచ్చారు. Photo : Twitter
ఇక మా ఎలక్షన్స్ విషయంలో కూడా స్పందించారు మోహన్ బాబు.. ఆయన మాట్లాడుతూ.. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ అనేది ఒక చరిత్ర. మంచు విష్ణు విజయాన్ని సాధించాడు. విష్ణు చెప్పినవన్నీ చేశాడని అన్నారు. బిల్డింగ్ ఒకటే తప్ప అన్ని పనులు అద్భుతంగా చేశాడని తెలిపారు. అయితే ఇప్పటికీ ఈ విషయంలో కొంత బాధ ఉందని అన్నారు. మా ఇద్దరి మధ్య కీచులాట అనేది భార్యాభర్తల మధ్య ఉన్నట్టే ఉంటుంది అని అన్నారు మోహన్ బాబు. Photo : Twitter
ఇక విష్ణు, మంచు మనోజ్‌లు సినిమాల పరంగా సక్సెస్ రేటు లేకపోవడంపై కూడా స్పందించారు మోహన్ బాబు. ఆయన మాట్లాడుతూ.. క్యారెక్టర్ లేకపోతేనో, నటన రాకపోతేనో బాధపడాలి గానీ సక్సెస్ రాలేదని బాధపడకూడదని అన్నారు మోహన్ బాబు. సక్సెస్ అనేది అదృష్టం మీద ఆధారపడి ఉంటుందని అన్నారు. సక్సెస్ ఈరోజు కాకపోతే రేపు వస్తుందని.. అయితే పిల్లల విషయంలో గర్వపడుతున్నానని అన్నారు. Photo : Twitter
ఇక మోహన్ బాబు సినీ కెరీర్ విషయానికి వస్తే.. నలభై ఆరేళ్ల ఏళ్ల క్రితం ‘స్వర్గం నరకం’తో మొదలైన నటప్రపూర్ణుని నట ప్రస్థానం స్వర్గం నరకంలానే ఎన్నో ఎత్తు పల్లాలతో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నేడు మోహన్ బాబు పుట్టినరోజు. మోహన్ బాబు టాలీవుడ్ పెదరాయుడు. అంతేకాదు.. నట ప్రపూర్ణ, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ ఇలాంటి బిరుదులెన్నో ఆయన నటనకు దాసోహం అన్నాయి.ఒకవైపు నటుడిగా 550 పైగా సిన్మాలు...నిర్మాతగా 50 పైగా చిత్రాలు. అటు మాజీ రాజ్యసభ సభ్యుడు.. ఇది మోహన్ బాబు ట్రాక్ రికార్డు. Photo : Twitter
ఒక వైపు సినిమా నటుడిగా ఉంటూనే రాజకీయ నాయకుడిగా...విద్యాసంస్థల అధినేతగా అటు సినీ, సామాజిక రంగాల్లో తనదైన ముద్ర వేసిన అతికొద్ది నటుల్లో మోహన్ బాబు ఒకరు.నటుడిగా ఒక మూసకు పరిమితం కాకుండా...హీరోగా...విలన్ గా...కమెడియన్ గా...క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేయడం మోహన్ బాబు ప్రత్యేకత. ఈయన 19 మార్చి 1952 లో మంచు నారాయణ స్వామి, మంచు లక్ష్మమ్మలకు పెద్ద కుమారుడిగా తిరుపతి సమీపంలోని మోదుగుల పాలెంలో జన్మించారు. Photo : Twitter
మోహన్ బాబు నటనకు 47యేళ్లు పూర్తి చేసుకొని ఇప్పటికీ తన నటనను కొనసాగిస్తూనే ఉన్నారు. అయినా ఆయన నటన మాత్రం ఎక్కడ తగ్గలేదు. అదే ఉత్సహంతో .. అదే స్టైయిల్ తో, అంతే క్రేజ్ తో సినిమాలను చేస్తూనే ఉన్నారు. క్యారెక్టరైజేషన్ మేనరిజంతో ప్రేక్షకులను మేస్మరైజ్ చేస్తున్నాడు. ఆయన కోసం ఇప్పటికి కొత్త కొత్త పాత్రలు పుడుతూనే ఉన్నాయి.తెలుగు చిత్ర పరిశ్రమలో మోహన్ బాబుది ఓ విలక్షణమైన శైలి. Photo : Twitter
దేనికి వెరవని తత్వం. ఎవరికి లొంగని మనస్తత్వం. అందరిని అక్కున చేర్చుకునే తత్వం. నటుడిగా, నిర్మాతగా, కథకుడిగా ఆయన రూటే సెపరేటు. సినిమా సినిమాకు నటనలో కొత్త వైవిధ్యాన్ని చూపిస్తూ.. విలక్షణమైన నటుడిగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు మోహన్ బాబు. పెదరాయుడిగా, శ్రీరాములయ్య గా, అడవిలో అన్నలాంటి పాత్రలు నటుడిగా ఆయన స్థాయిని పెంచాయి. Photo : Twitter
నటుడిగా ఆయన ఒక భాషకే పరిమితం కాలేదు. తొలినాళ్లలో హీరోగా కెరీర్ ప్రారంభించి.. ఆ తరువాత విలన్ గా టర్న్ తీసుకున్నారు. కామెడీ విలన్ గానూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. తరువాత హీరోగా మారి నటుడిగా ఆయన టాలెంట్ నిరూపించుకున్నాడు ఈ అధిపతి.మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. ఫిజిక్స్ లో డిగ్రీ చదివి.. ఫిజికల్ ట్రైనర్ గా కెరీర్ స్టార్ట్ చేశారు. అక్కడి నుంచి సినిమాల్లోకొచ్చి మోహన్ బాబుగా పేరు మార్చుకున్నారు. Photo : Twitter
నారాయణస్వామి నాయుడు జన్మనిస్తే.. మోహన్ బాబుకు నటుడిగా జన్మనిచ్చింది దాసరి నారాయణరావు. దాసరి దర్శకత్వంలో వచ్చిన స్వర్గం- నరకం చిత్రంలో నటనతో లైమ్ లైట్ లోకొచ్చారు మోహన్ బాబు. హీరోగా పరిచయమై.. విలన్‌గా కమెడియన్‌గా.. ఆపై హీరోగా కెరీర్ కొనసాగించిన భారతీయ చిత్ర పరిశ్రమలో మోమన్ బాబు ఒక్కరే అని చెప్పాలి. ఎన్ని సార్లు కింద పడ్డా.. మళ్లీ గోడకు కొట్టిన బంతిలా పైకెచ్చారు మోహన్ బాబు.. Photo : Twitter