మోహన్ బాబు, దర్శకుడు బి.గోపాల్ కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం ‘అసెంబ్లీ రౌడీ’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఈ చిత్రం తమిళంలో సత్యరాజ్ హీరోగా నటించిన ‘వేలై కిడాయిచుడుచు’ మూవీకి రీమేక్. ‘అసెంబ్లీ రౌడీ’ సక్సెస్తో మోహన్ బాబు కలెక్షన్ కింగ్ అనే బిరుదు వచ్చి చేరింది. ఈ సినిమా తర్వాత హీరోగా మోహన్ బాబు వెనుదిరిగి చూసుకోలేదు. ఈ సినిమా తర్వాత మళ్లీ హీరోగా స్టార్ డమ్ అందుకున్నారు మోహన్ బాబు. ఇక మోహన్ బాబుకు కలెక్షన్ కింగ్ బిరుదు ఈ సినిమా తర్వాతే ఆయన పేరు ముందు వచ్చి చేరింది. (Twitter/Photo)
మోహన్ బాబు, దర్శకుడు బి.గోపాల్ కాంబినేషన్లో వచ్చిన నాల్గో చిత్రం ‘అడవిలో అన్న’. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే నమోదు చేసింది. ఈ చిత్రంలో మోహన్ బాబు సరసన రోజా కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో మోహన్ బాబు నక్సలైట్ పాత్రలో నటించాడు. అప్పట్లో రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ ఈ సినిమా చేయడం పై పెద్ద వివాదమే నడిచింది. ఆ సంగతి పక్కనపెడితే.. ఈ సినిమా తెలంగాణ పల్లెలతో పాటు శ్రీకాకుళం, ఖమ్మం, విజయనగరం వంటి నక్సలైట్ ప్రాబల్య ప్రాంతాల్లో కనీవినీ ఎరగనీ రీతిలో నడిచి సంచలనం సృష్టించింది. (Youtube/Credit)
మొత్తంగా మోహన్ బాబు, దర్శకుడు బి.గోపాల్ కాంబినేషన్లో నాలుగు చిత్రాలు తెరకెక్కితే.. నాలుగు సినిమాలు సక్సెస్ సాధించాయి. అంటే వీరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలు 100 శాతం సక్సెస్ సాధించడం విశేషం. మొత్తంగా టాలీవుడ్లో మోహన్ బాబు, బి. గోపాల్ది సక్సెస్ ఫుల్ కాంబినేషన్ అనే చెప్పాలి. మొత్తంగా మోహన్ బాబుకు కలెక్షన్ కింగ్ బిరుదు రావడం వెనక దర్శకుడు బి.గోపాల్ ఉన్నారు. (Twitter/Photo)