అటు మనోజ్, ఇటు మౌనిక ఇద్దరిదీ కూడా రెండో వివాహమే కావడం విశేషం. తమ తమ జీవితంలో రెండో సారి ఏడడుగులు వేసి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. దివంగత దంపతులు భూమా నాగిరెడ్డి, శోభారెడ్డి రెండో కుమార్తెనే ఈ భూమా మౌనిక రెడ్డి. మౌనికను ప్రేమించిన మంచు మనోజ్.. ఇప్పుడు ఆమె మెడలో మూడుముళ్లు వేసి భార్యగా తన జీవితంలోకి ఆహ్వానించారు.
ఎవరో ఏదో అనుకుంటే వాటిని తాను పట్టించుకోనని, సోషల్ మీడియాలో వచ్చే గాసిప్స్ చూస్తూ అన్నీ పట్టించుకునే.. తనను తాను మరిచిపోయే పరిస్థితి వస్తుందని మోహన్ బాబు అన్నారు. రోడ్డు మీద ఏనుగు వెళుతుంటే.. పక్కన ఉన్న కుక్కలెన్నో మొరుగుతూ ఉంటాయి. అవన్నీ పట్టించుకుంటే ఎలా? అంటూ తనపై వచ్చిన రూమర్లను ఖండించారు కలెక్షన్ కింగ్.