తన ఆలోచనలతో.. ఆదర్శాలతో కొండలను సైతం కదిలించగల డాషింగ్ అండ్ డైనమిక్ ప్రొఫెసర్ కమ్ సైక్రియాట్రిస్ట్ విశ్వామిత్ర పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారు. మంచు లక్ష్మీతో మోహన్ బాబు కలిసి నటిస్తోన్న తొలి చిత్రం. గతంలో మోహన్ బాబు తన తనయుడు విష్ణు, మనోజ్‌లతో కలిసి నటించిన ‘పాండవులు పాండవులు తమ్మెదా’ సినిమాలో మంచు లక్ష్మీ అతిథి పాత్రలో నటించింది. ఇపుడు పూర్తి స్థాయిలో ఈ సినిమాలో తండ్రీ కూతుళ్లు కలిసి నటించడం విశేషం. (Twitter/Photo)
ఈ సందర్భంగా మోహన్ బాబు ట్వీట్ చేస్తూ నా కూతురు నిర్మిస్తూ నటిస్తోన్న ‘అగ్ని నక్షత్రం’లో తనతో మొదటిసారి ప్రొఫెసర్ విశ్వామిత్రగా నటిస్తున్నాను. నాకు భయం భయంగా ఉందంటూ ట్వీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీలో తన పేరు చెబితేనే భయపడేలా చేసే మోహన్ బాబు .. కూతురుకు భయపడటం చూసి అందరు ఆశ్యర్యపోతున్నారు. (Twitter/Photo)