హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు కృష్ణ మరణించారు. మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్తో కృష్ణ తుది శ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. చివరి క్షణాల్లో ఆయనకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకున్నామని, చికిత్సకు ఆయన శరీరం సహకరించలేదని డాక్టర్లు చెప్పారు.
కాగా, కృష్ణ పార్థివ దేహాన్ని చూసి నివాళి అర్పించేందుకు వచ్చిన మోహన్ బాబు.. ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. కృష్ణను కడసారి చూసి వెక్కి వెక్కి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కృష్ణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కన్నీళ్లు ఆపుకోలేకపోయారు మోహన్ బాబు. కొన్ని నిమిషాల పాటు కృష్ణ పార్థివ దేహం వద్దనే ఉన్న మోహన్ బాబు.. ఆ తర్వాత పక్కనే ఉన్న కుర్చీలో కూర్చున్నారు.