మంచు భక్త వత్సలం నాయుడును మోహన్ బాబుగా పేరు మార్చి అతని కెరీర్ తీర్చిదిద్దిన వాళ్లల్లో దాసరి నారాయణ రావు ప్రముఖులు అని చెప్పాలి. ఇక మోహన్ బాబు కూడా దాసరి శిష్యుడు అని ఎపుడు చెప్పుకుంటూ గురువుపై అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఆయన లేనిదే నేను లేను అంటూ గురువుపై తన కున్న గౌరవాన్ని చాటుకుంటూ ఉంటారు.
నారాయణస్వామి నాయుడు జన్మనిస్తే.. మోహన్ బాబుకు నటుడిగా జన్మనిచ్చింది దాసరి నారాయణరావు. దాసరి దర్శకత్వంలో వచ్చిన స్వర్గం- నరకం చిత్రంలో నటనతో లైమ్ లైట్ లోకొచ్చారు మోహన్ బాబు. హీరోగా పరిచయమై.. విలన్‌గా కమెడియన్‌గా.. ఆపై హీరోగా కెరీర్ కొనసాగించిన భారతీయ చిత్ర పరిశ్రమలో మోమన్ బాబు ఒక్కరే అని చెప్పాలి. ఎన్ని సార్లు కింద పడ్డా.. మళ్లీ గోడకు కొట్టిన బంతిలా పైకెచ్చారు. అంతలా వీళ్లిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది.
ఇక దివంగత దాసరి నారాయణ రావు ఉన్నపుడు అంతా గుట్టుగా సాగిన వాళ్ల ఇంటిగుట్టు.. ఆ తర్వాత రచ్చ కెక్కింది. దానికి కారణం ఇంట్లో ఆస్తి గొడవలే. ఆ మధ్య ఓ సారి దాసరి పెద్ద కోడలు బయటికి వచ్చి తన ఆస్తి కొట్టేసారంటూ మోహన్ బాబుపై ఆరోపణలు చేసింది. ఇక గతేడాది దాసరి పెద్ద కుమారుడు ప్రభు కనిపించకుండా పోయాడు. వారం రోజుల తర్వాత ఆయన మళ్లీ బయటికి వచ్చాడు. అది కూడా నాటకమే అని తెలిసి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన కేస్ ఇది. ఆ తర్వాత ఈయన కుమారులు అరుణ్ కుమార్, ప్రభులపై జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలుస్తుంది. దానికి కారణం అప్పు తీర్చమని అడగడమే. అసలు విషయం ఏంటంటే.. దాసరి బతికున్న రోజుల్లో ఆయన తనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరైన సోమశేఖర్ రావు అట్లూరి నుంచి 2.10 కోట్లు అప్పుగా తీసుకున్నారు.
ఆ అప్పు సంగతి పక్కన పెడితే.. ఇప్పటికీ దాసిరి నారాయణ రావు ఇంట్లో ఆస్తి గొడవలు ఇంకా సద్దుమణగలేదు. ఇంతలోనే ఆయన శిష్యుడు మోహన్ బాబు ఇంట్లో ముసలం మొదలైంది. ఆయన కుమారులై మంచు విష్ణు, మనోజ్ సోషల్ మీడియా వేదికగా తమ ఇంటిగుట్టును రచ్చ కీడ్చారు. క్రమశిక్షణ.. క్రమశిక్షణ.. డిసిప్లిన్ అంటూ సెట్ లో గుండెలు బాదుకునే మోహన్ బాబు గుండెలపై తన్నిన కొడుకులు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. (Twitter/Photo)
మంచు విష్ణు, మంచు మనోజ్ లకు పడటం లేదని చాలా రోజులుగా ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. వాళ్లిద్దరూ కూడా వేరువేరుగా ఉంటున్నట్లు తెలియగా.. ఒక్కసారిగా మంచు మనోజ్ తన సోషల్ మీడియాలో వీడియో పెట్టడంతో ఇష్యూ రచ్చెకెక్కింది. ఇక మంచు మనోజ్.. మౌనికను రెండో పెళ్లి చేసుకోవడం కూడా మంచు విష్ణుకు ఇష్టం లేదన్నట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు వీరి ఫ్యామిలీ ఇపుడు టీడీపికి అనుకూలంగా ఉండటం కూడా మంచు విష్ణుకు నచ్చలేదనే టాక్ కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా ఇపుడు బహిరంగంగా వీళ్లిద్దరు రోడ్డున పడటం ఇపుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇక మోహన్ బాబు పెద్ద భార్య విద్యా దేవికి మంచు లక్ష్మి, విష్ణులు జన్మించారు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె చెల్లెలు నిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరికి మంచు మనోజ్ జన్మించారు. ఇలా సవతి సోదరులే అయినా.. ఎపుడు వీధిన పడి కొట్టుకున్నది లేదు. ఇపుడు సడెన్‌గా ఇలా జరగడంతో మోహన్ బాబు కూడా మానసికంగా కృంగిపోయినట్టు సమాచారం. ఏది ఏమైనా ఈ వివాదం ఇంతటితో ఆగుతుందా అనేది చూడాలి.