MOHAN BABU COLLECTION KING OF TOLLYWOOD COMPLETED 45 YEARS IN TELUGU FILM INDUSTRY TA
MohanBabu@45Years: టాలీవుడ్లో మోహన్ బాబు నట ప్రస్థానానికి 45 యేళ్లు..
MohanBabu@45Years: తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన రూటే సెపరేటు. తింటే గారెలే తినాలి. వింటే భారతమే వినాలి. డైలాగ్ కొడితే ఆయనే కొట్టాలి. అదీ మోహన్ బాబు అంటే. ‘అసెంబ్లీ రౌడీ’గా మాస్ ఆడియన్స్‌ను మెప్పించినా...‘అల్లుడుగారి’గా క్లాస్ ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసిన అది ఆయనకే చెల్లింది. నలభై ఐదేళ్ల ఏళ్ల క్రితం ‘స్వర్గం నరకం’తో మొదలైన నటప్రపూర్ణుని నట ప్రస్థానం స్వర్గం నరకంలానే ఎన్నో ఎత్తు పల్లాలతో ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. నేటితో నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో 45 యేళ్లు కంప్లీట్ చేసుకున్నారు.
తెలుగు సినీ పరిశ్రమలో హీరోగా, విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా తనదైన నటనతో ఆకట్టుకున్న మోహన్ బాబు నేటితో 45 ఏళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. (Twitter/Photo)
2/ 41
45 సినీ కెరీర్లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసారు. హీరోగా పరిచమైన ఓ వ్యక్తి ఆ తర్వాత విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మెప్పించిన ఓ నటుడు మళ్లీ హీరోగా సత్తా చాటి స్టార్ డమ్ దక్కించుకోవడం అనేది.. భారతీయ చిత్ర పరిశ్రమలో అది మోహన్ బాబుకు మాత్రమే సాధ్యమైంది. (Twitter/Photo)
3/ 41
గత 45 యేళ్లుగా విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మోహన్ బాబు (Twitter/Photo)
4/ 41
సరిగ్గా 45 యేళ్ల క్రితం భక్తవత్సలం నాయుడుగా సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఇతను.. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్వర్గం నరకం’ సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. (Twitter/Photo)
5/ 41
‘స్వర్గం నరకం’ సినిమాతో మోహన్ బాబు కాకుండా ఈశ్వర్ రావు, సీమ, అన్నపూర్ణ వంటి తదితర నటులు వెండితెరకు పరిచయమయ్యరు. (Twitter/Photo)
6/ 41
టాలీవుడ్లో విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న నట ప్రపూర్ణ మోహన్ బాబు (Twitter/Photo)