చిరంజీవి | మెగాస్టార్ చిరంజీవి కూడా తన కెరీర్‌ను హీరోగా మొదలు పెట్టినా.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా సైడ్ రోల్స్ చేస్తూ మెగాస్టార్ అయ్యారు. ఈ యేడాది చిరంజీవి ఆచార్య సినిమాతో పలకరించారు.త్వరలో ‘గాడ్ ఫాదర్’, భోళా శంకర్, వాల్తేర్ వీరయ్య వంటి సినిమాలతో పలకరించనున్నారు. (Twitter/Photo)
రవితేజ |రవితేజ కూడా కర్తవ్వం సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ చేసినా రవితేజ.. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో గుర్తింపు లేని పాత్రల్లో నటిస్తూ.. చివరకు హీరోగా మాస్ మహారాజ్ అనిపించుకున్నారు. గతేడాది క్రాక్‌తో కిరాక్ పుట్టించిన రవితేజ ఈ యేడాది ‘ఖిలాడి’తో నారాజ్ చేసాడు. వీటితో పాటు త్వరలో ‘రామరావు ఆన్ డ్యూటీ’’, ధమాకా, టైగర్ నాగేశ్వరరావు, ’రావణాసుర’ వంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌లతో పలకరించనున్నారు. (Ravi Teja)
శ్రీకాంత్ | శ్రీకాంత్ కూడా కెరీర్ మొదట్లో విలన్ పాత్రల్లో నటించిన ఆ తర్వాత హీరోగా తన సత్తా చూపెట్టారు. ఈయన బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘అఖండ’ సినిమాలో విలన్‌గా మరోసారి తన సత్తా చూపెట్టారు.ఈ సినిమా తర్వాత శ్రీకాంత్‌కు వరుసగా విలన్ అవకాశాలొస్తున్నాయి. (Twitter/Photo)
శర్వానంద్ | శర్వానంద్ కూడా 2004లో ఐదవ తారీఖు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆ తర్వాత శంకర్ దాదా ఎంబీబీఎస్, సంక్రాంతి, గౌరీ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్‌లో రాణించాడు. ప్రస్థానంతో హీరోగా అసలైన ప్రస్థానం మొదలుపెట్టాడు. (Twitter/Photo)
శ్రీ విష్ణు | శ్రీ విష్ణు విషయానికొస్తే.. నారా రోహిత్ హీరోగా నటించిన ‘బాణం’ సినిమాతో నటుడిగా పరిచయమైన ఈయన.. ఆ తర్వాత ‘సోలో’, ‘లవ్ ఫెయిల్యూర్’, ‘నా ఇష్టం’, ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ చిత్రాల్లో చిన్న పాత్రల్లో నటించారు. ఇక ‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాలో రాయల్ రాజు పాత్ర శ్రీ విష్ణుకు మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత సాగర్ చంద్ర దర్శకత్వంలో నటించిన ‘అప్పట్లో ఒకడుండేవాడు’ చిత్రం హీరోగా బిగ్ బ్రేక్ ఇచ్చింది. (Sree Vishnu)
సునీల్ | ‘అందాల రాముడు’ సినిమాతో హీరో కాకముందు సునీల్ కమెడియన్‌గా సత్తా చూపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు హీరోగా మార్కెట్ పడిపోవడంతో మళ్లీ కమెడియన్ తో పాటు విలన్‌గా ‘డిస్కో రాజా’, కలర్ ఫోటో’’తో పాటు ఇక అల్లు అర్జున్, సుకుమార్‌ల ‘పుష్ఫ’లో మంగళం శ్రీనుగా విలన్‌గా సత్తా చూపెట్టాడు. (Twitter/Photo)