MLA Roja: తెలుగు సినీ నటి రోజా పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికీ ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరగానే ఉంది. బుల్లితెరలో ప్రసారమవుతున్న కామెడీ షో జబర్దస్త్ లో జడ్జిగా చేస్తుంది. ఎన్నో ఏళ్ల నుంచి ఈ షోలో ఉంటూ.. ఇందులో కమెడియన్స్ వేసే పంచ్ లకే పంచులు వేస్తుంది. ఇదిలా ఉంటే తను ఓ ప్రాబ్లమ్ తో బాధ పడుతుందట. ఇంతకీ అసలు సంగతేంటంటే.. అదిరే అభి తన స్కిట్ లో భాగంగా ఫోన్ లు అందరికీ ఎలా కనెక్ట్ అయ్యిందో.. దానివల్ల ఎంత ఇబ్బందులు ఉన్నాయో చెప్పాడు. ఇక వెంటనే రోజా స్పందిస్తూ.. మా ఇంట్లో కూడా ఇదే ప్రాబ్లమ్ తో బాధపడుతున్నాను అంటూ.. ఓ టీం లీడర్ ని ఉద్దేశించి.. నాకు అనిపించింది చెప్తే హర్ట్ అవుతారని అనలేదని తెలిపింది రోజా.